తూప్రాన్, వెలుగు: మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితాను వార్డు వారీగా రూపొందించి గురువారం రిలీజ్చేయాలని ఆర్డీవో జయచంద్రారెడ్డి ఆదేశించారు. బుధవారం తూప్రాన్ మున్సిపాలిటీకి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను మున్సిపల్ఆఫీస్లో కమిషనర్ గణేశ్రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డులకు సంబంధించి 32 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ స్టేషన్ వారీగా ఓటర్ జాబితాను విడుదల చేయాలని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి తుది జాబితాను 10న రిలీజ్చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు పేర్కొన్నారు.
