ఉమ్మడి మెదక్ జిల్లాలో బల్దియాల్లో ఓటర్ల లెక్క తేలింది..

ఉమ్మడి మెదక్ జిల్లాలో  బల్దియాల్లో ఓటర్ల లెక్క తేలింది..

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు గురువారం మున్సిపాలిటీలలో వార్డుల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాలను కమిషనర్లు విడుదల చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికలు జరుగనున్న 19 మున్సిపాలిటీలు, 410 వార్డుల్లో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు,

 వారిలో మహిళలు, పురుషులు, ఇతరులు ఎంత మంది అన్న వివరాలను ప్రకటించారు. వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ జాబితాలను కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ ఆఫీస్, తహశీల్దార్ ఆఫీస్, మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద ప్రదర్శించారు. ఆ జాబితాలు పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని మున్సిపల్ కమిషనర్లు సూచించారు. 

సిద్దిపేట జిల్లా..

జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్ మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 72 వార్డులు ఉండగా ఆయా వార్డుల్లో ఓటర్ల వివరాలను అధికారులు వెల్లడించారు. ఒక్కో వార్డులో 700 నుంచి 2,000 మంది ఓటర్లు ఉండే విధంగా విభజించారు. చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డు లు ఉండగా మొత్తం ఓటర్లు 13,777 ఉన్నారు. వారిలో పురుషులు 6,658 కాగా, మహిళలు 7,119 మంది. దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డు లు ఉండగా మొత్తం ఓటర్లు 21,346 ఉన్నారు. వారిలో పురుషులు 10,224 మంది, మహిళలు 11,118 మంది ఉన్నారు.

 హుస్నాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను మొత్తం19,227 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 9,348 మంది పురుషులు, 9,873 మంది మహిళలు, ఆరుగురు ఇతరులున్నారు. గజ్వేల్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా మొత్తం ఓటర్లు 46,740 ఉన్నారు. వారిలో పురుషులు 23,143మంది, మహిళలు 23,647 మంది ఉన్నారు. 

మెదక్ జిల్లా...

జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో మొత్తం 75 వార్డులు ఉన్నాయి. మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులుండగా మొత్తం ఓటర్లు 37,016 మంది ఉన్నారు. పురుషులు 17,580 మంది, మహిళలు 19,435 మంది, ఒకరు ఇతరులున్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా మొత్తం 20,427 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 10,100, మహిళలు 10,327 మంది ఉన్నారు. రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డు లు ఉండగా మొత్తం 13,106 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 6,298 మంది పురుషులు, 6,808 మంది మహిళలు. నర్సాపూర్ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా మొత్తం 17,066 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 8,328 మంది పురుషులు , 8,737 మంది మహిళలు, ఒకరు ఇతరులు ఉన్నారు. 

సంగారెడ్డి జిల్లా..

జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలు, 263 వార్డులు ఉన్నాయి. మున్సిపాలిటీ వారీగా ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 26 వార్డు లు ఉండగా మొత్తం 36,071 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 18,764, మహిళలు 17,306, ఇతరులు ఒక్కరు ఉన్నారు. ఇంద్రేశం మున్సిపాలిటీలో 18 వార్డు లు ఉండగా మొత్తం 13,140 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 6,546, మహిళలు 6,593, ఇతరులు ఒక్కరున్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా మొత్తం 23,862 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 11,997, మహిళలు 11,862, ముగ్గురు ఇతరులున్నారు. జహీరాబాద్ మున్సిపాలిటీలో 37 వార్డులు ఉండగా మొత్తం 90,050 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 45,927, మహిళలు 44,123. కోహిర్ మున్సిపాలిటీలో 16 వార్డు లు ఉండగా మొత్తం 10,944 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 5,545, మహిళలు 5,399. అందోల్, - జోగిపేట మున్సిపాలిటీ లో 20 వార్డులు ఉండగా మొత్తం 16,460 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 7,893, మహిళలు 8,567. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా మొత్తం 17,705 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 9,095, మహిళలు 8,607, ముగ్గురు ఇతరులున్నారు. గడ్డపోతారం మున్సిపాలిటీలో 18 వార్డులు ఉండగా, మొత్తం 11,983 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 6,287, మహిళలు 5,696. జిన్నారం మున్సిపాలిటీలో 20 వార్డు లు ఉండగా మొత్తం 12,865 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 6,162, మహిళలు 6,522, ఇతరులు ఒక్కరు ఉన్నారు. సదాశివపేట మున్సిపాల్టీల్లో 26 వార్డు లు ఉండగా, మొత్తం 37,133 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 18,226, మహిళలు 18,905, ఇద్దరు ఇతరులున్నారు.