
మొఘల్ చక్రవర్తుల ఆక్రమణలు, అరాచకాలపై వరుస చిత్రాలు వస్తున్నాయి. హిందీలో ‘ఛావా’, తెలుగులో ‘హరిహర వీరమల్లు’ చిత్రాల తర్వాత ఇప్పుడు తమిళంలో ‘ద్రౌపతి 2’ పేరుతో ఓ సినిమా వస్తోంది. ‘బకాసురన్’ ఫేమ్ మోహన్ జి దీనికి దర్శకుడు. గతంలో ఇదే దర్శకుడు తెరకెక్కించిన ‘ద్రౌపతి’ చిత్రానికి ఇది సీక్వెల్.
రిచర్డ్ రిషి, రక్షణ ఇందుసుదన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. 14వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తులు తమిళనాడులోకి ప్రవేశించిన అనంతర పరిణామాలు.. హోయసాల చక్రవర్తి మూడవ వీర వల్లలార్, సేంధమంగలం పాలకులైన కడవరాయల వీరత్వం, త్యాగాల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు.
నేతాజీ ప్రొడక్షన్స్, జి.ఎం.ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నాయి. నట్టి నటరాజ్ కీలకపాత్ర పోషిస్తుండగా జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే డెబ్భై శాతం షూటింగ్‌ను ముంబైలో చిత్రీకరించారు. సెంజి, తిరువణ్ణామలై, కేరళలలో తర్వాతి షెడ్యూల్స్ షూటింగ్ చేసి ఈ ఏడాది చివర్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.