డీఆర్డీఓ అనుబంధ సంస్థలో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ జాబ్..

డీఆర్డీఓ అనుబంధ సంస్థలో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ జాబ్..

డీఆర్​డీఓ అనుబంధ సంస్థ ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్ ఎస్టాబ్లిష్​మెంట్ (డీఆర్​డీఓ ఏడీఆర్​డీఈ) జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.  

పోస్టుల సంఖ్య: 05 

పోస్టులు: జూనియర్ రీసెర్చ్ ఫెలో(మెకానికల్ ఇంజినీరింగ్) 02, జూనియర్ రీసెర్చ్ ఫెలో(ఎరోస్పేస్ ఇంజినీరింగ్) 01, జూనియర్ రీసెర్చ్ ఫెలో (ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్​) 01, జూనియర్ రీసెర్చ్ ఫెలో (టెక్స్​టైట్ ఇంజినీరింగ్) 01. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈ లేదా ఎం.టెక్/ ఎంఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 20. 

లాస్ట్ డేట్:  సెప్టెంబర్ 25.  

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు  drdo.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.