హైడ్రా ఎదుట DRF సిబ్బంది ఆందోళన..జీతంలో రూ.5 వేలు కట్ చేశారని నిరసన

హైడ్రా ఎదుట DRF సిబ్బంది ఆందోళన..జీతంలో రూ.5 వేలు కట్ చేశారని నిరసన
  • తగ్గిన జీతాన్ని మ్యాచింగ్​ గ్రాంట్​ కింద ఇస్తామన్న హైడ్రా

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీతాలు తగ్గించారని హైడ్రా ఆఫీసు ఎదుట బుధవారం డీఆర్ఎఫ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. రాత్రి, పగలు పనులు చేయించుకుని జీతం తగ్గించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జీహెచ్ఎంసీ ఈవీడీఎంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేసిన 1,195 మంది సిబ్బంది ప్రస్తుతం హైడ్రా డీఆర్ఎఫ్ లో డ్యూటీలు చేస్తున్నారు. 

]ఇందులో అసిస్టెంట్లకు రూ.19,500, మేనేజర్లకు రూ.22,500 జీతాలున్నాయి. అయితే, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఒకేలా జీతాలుండాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో రిలీజ్​చేయడంతో రూ.5 వేల జీతం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇదే కొనసాగితే డ్యూటీలు చేయకుండా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అయితే, ఆందోళనకు దిగిన ఉద్యోగుల‌‌‌‌‌‌‌‌తో హైడ్రా క‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ర్ ఏవీ రంగ‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌ చ‌‌‌‌‌‌‌‌ర్చలు జ‌‌‌‌‌‌‌‌రిపారు. జీతాలు త‌‌‌‌‌‌‌‌గ్గవ‌‌‌‌‌‌‌‌ని, జీహెచ్ ఎంసీ నుంచి మ్యాచింగ్ గ్రాంట్ రిలీజ్ అవ్వగానే స‌‌‌‌‌‌‌‌ర్దుబాటు చేస్తామ‌‌‌‌‌‌‌‌ని హామీ ఇవ్వడంతో విధుల్లోకి చేరారు.