- శంకర్పల్లి పంచాయతీలో రెండు బోర్ వెల్స్ ఏర్పాటు
కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో రెండు గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారమైంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం శంకర్పల్లి పంచాయతీ పరిధిలోని శంకర్పల్లి, సండ్రోనిపల్లి గ్రామాల్లో రూ.4 లక్షల సీఎస్ఆర్ నిధులతో రెండు బోర్వెల్స్ ఏర్పాటు చేశారు.
గ్రామాల్లో తాగునీటి సమస్యలను కాంగ్రెస్ నేతలు,
ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మంత్రి వివేక్దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఆయన వెంటనే రెండు బోర్వెల్స్ మంజూరు చేశారు. సమస్యను పరిష్కరించిన మంత్రికి ఆయా గ్రామాల ప్రజలు, నేతలు కృతజ్ఞతలు తెలిపారు. బోర్వెల్స్ ఏర్పాటు కార్యక్రమంలో సర్పంచ్ పి.వెంకటేశ్, మండల అధ్యక్షుడు కె.జీవన్ కుమార్, ఉపాధ్యక్షుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
