హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తాగునీటికి అంతరాయం ఏర్పడింది. బైరామల్ గూడ ఫ్లై ఓవర్ పనులతో పాటు.. మెట్రో పాలిటన్ వాటర్ సప్లై, మురుగునీటి బోర్డు కలిసి మరమ్మత్తు పనులు చేపడుతుండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో సుమారు 30 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగింది. బైరామల్ గూడ జంక్షన్లో ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా మరమ్మత్తులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభావిత ప్రాంతాలైన... బాలాపూర్, మైసారం, బార్కాస్, తార్నాక, లాలాపేట్, బౌద్ధనగర్, మారేడ్‌పల్లి, భోలక్‌పూర్, ప్రకాష్‌నగర్, పాటిగడ్డలో ఇప్పటికే నీటి సరఫరా నిలిపివేశారు. మరోవైపు.. మేకలమండి, హస్మత్‌పేట్, ఫిరోజ్‌గూడ, గౌతమీ నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటో నగర్, అల్కాపురి, రామంతపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కానగర్, బీరప్పగడ్డ, బుద్వేల్, శాస్త్రిపురం, బోడుప్పల్, మీర్‌పేట్, మీర్‌పేట్, బాష్దాబాద్‌లలో కూడా నీటి సరఫరా నిలిచిపోయింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత నీటి సరఫరాను పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.
