ప్రైవేట్ ట్రావెల్స్.. స్లీపర్ బస్సులో యువతిపై డ్రైవర్ అత్యాచారం : బస్సు సీజ్

ప్రైవేట్ ట్రావెల్స్.. స్లీపర్ బస్సులో యువతిపై డ్రైవర్ అత్యాచారం : బస్సు సీజ్

మనుషులా.. మృగాలా అన్నట్లు జరుగుతున్నాయి సంఘటనలు.. ఒకే రోజు రెండు అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. సంగారెడ్డి నుంచి ప్రకాశం జిల్లా వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో.. ఓ యువతిపై అత్యంత కిరాతకంగా లైంగిక దాడి చేశాడు ఆ బస్సు డ్రైవర్.. కదులుతున్న బస్సులోనే.. యువతి నోట్లో గుడ్డలు కుక్కి.. నోరుమూసి మరీ అత్యాచారం చేశాడు ఆ డ్రైవర్. దీనిపై బస్సులోని మిగతా ప్రయాణికులు కంప్లయింట్ చేయటంతో.. బస్సును పట్టుకుని.. పోలీస్ స్టేషన్ కు తరలించారు ఓయూ పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే..

నిర్మల్ నుండి ప్రకాశం జిల్లాకు 36 మంది ప్రయాణికులతో హరికృష్ణ ట్రావెల్స్ బస్సు వెళ్తుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు వచ్చింది. తెల్లవారుజామున అంతా గాడ నిద్రలో ఉన్న సమయంలో డ్రైవర్ అఘాంతానికి పాల్పడ్డాడు. యువతి వద్దకు వెళ్లి శబ్ధం చేయకుండా తన నోట్లో గుడ్డలు పెట్టి అత్యాచారం చేశాడు. అత్యాచారం జరిగేటప్పుడు బస్సు కదులుతూనే ఉంది. బస్సులో 36 మంది ప్రయాణికులు కూడా ఉన్నారన్న భయం లేకుండా ఈ దారుణానికి వడిగట్టాడు డ్రైవర్. 

దీంతో యువతి 100కు ఫోన్ చేసింది. బస్సును వెంబడించిన హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. యువతి దగ్గర స్టేట్మెంట్ తీసుకుని కంప్లైయింట్ ఫైల్ చేశారు. యువతిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అత్యాచారం చేసిన డ్రైవర్ పరారీలో ఉండగా మరో డ్రైవర్ సిద్ధయ్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బస్సును సీజ్ చేసినట్టు తెలిపారు.  ఘటనపై కేసు నమోదు చేసుకుని విచరాణ చేపడతామన్నారు హైదరాబాద్ పోలీసులు.