స్టాక్ మార్కెట్ పతనం: ఇది సంక్షోభమా ? చరిత్ర ఏం చెబుతోందంటే ?

స్టాక్ మార్కెట్ పతనం: ఇది సంక్షోభమా ? చరిత్ర ఏం చెబుతోందంటే ?

ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీలు గరిష్ట స్థాయి నుండి సుమారు 14% పడిపోవడంతో పెట్టుబడిదారుల్లో కలవరం మొదలైంది. యుద్ధాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అయితే, గత చరిత్రను పరిశీలిస్తే ఇలాంటి సమయాల్లో మనం భయపడాల్సిన అవసరం లేదని 4 కారణాలు కనిపిస్తున్నాయి... 

1. పతనం అనేది తాత్కాలికం
గతంలో గల్ఫ్ యుద్ధం, 9/11 దాడులు, 2008 ఆర్థిక సంక్షోభం లేదా 2020 కోవిడ్ సమయంలో కూడా స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి.  కోవిడ్ సమయంలో కేవలం ఒక్క నెలలోనే షేర్ మార్కెట్ 37% పడిపోయింది. కానీ, ప్రతిసారీ స్టాక్ మార్కెట్ ఆ పతనం నుండి కోలుకుని మళ్ళీ పైకి లేచింది.

2. మూడు నెలల్లోనే మార్పు 
చారిత్రక గణాంకాల ప్రకారం, ఏదైనా పెద్ద సంక్షోభం వచ్చి మార్కెట్ పడిపోయిన 3 నెలల తర్వాత సగటున 10% లాభాలు వచ్చాయి. అంటే ప్రారంభంలో వచ్చే షాక్ తగ్గాక, మార్కెట్లు మళ్ళీ పుంజుకోవడం మొదలుపెడతాయి.

3. ఓపిక ఉంటే  లాభాలు
సంక్షోభం వచ్చిన ఆరు నెలలకు సగటున 17%, తొమ్మిది నెలలకు 26% వరకు షేర్ మార్కెట్ లాభాలను ఇచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. మార్కెట్ ఎంత వేగంగా పడిపోతుందో, అంతే వేగంగా కోలుకుంటుంది.

4.  పెట్టుబడిదారులకు  ఒక అవకాశం
మార్కెట్ పడిపోయినప్పుడు భయపడి షేర్లను అమ్మేయడం కంటే, మంచి కంపెనీల షేర్లు తక్కువ ధరకు దొరికినప్పుడు వాటిని కొనుగోలు చేయడం తెలివైన పని. దీర్ఘకాలం పాటు పెట్టుబడిని కొనసాగించే వారే ఇలాంటి సమయాల్లో ఎక్కువ లాభపడతారు.