ములుగు/ కాశీబుగ్గ/ భూపాలపల్లి రూరల్/ రేగొండ/ జనగామ అర్బన్, వెలుగు: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఔషధాల దుర్వినియోగం, మత్తు పదార్థాల నివారణపై అవగాహన ర్యాలీలు చేపట్టారు. వరంగల్ కొత్తవాడలోని కెమిస్ట్ భవన్ వద్ద కలెక్టర్ సత్యశారద ర్యాలీని ప్రారంభించగా, అంతకుముందు సీపీ సన్‌ప్రీత్‌సింగ్, హనుమకొండ కలెక్టర్చాహత్బాజ్పాయ్తో కలిసి ఎంజీఎంలో డీఅడిక్షన్ సెంటర్‌ను పరిశీలించారు. ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించి సేవలపై ఆరా తీశారు. అనంతరం నర్సింగ్ స్టాఫ్ కి నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ గేమ్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి ర్యాలీని ప్రారంభించారు.
అంతకుముందు ఆయన రేగొండ మండలం గడిపల్లి వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ములుగులో డ్రగ్ ఇన్స్పెక్టర్ కోమల్ల దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. జనగామలో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ప్రారంభించారు. అంతకుముందు డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ చేతన్ నితిన్, అడిషనల్ కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
