హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ సప్లయర్ బాలాజీ కాల్‌డేటా అతని ‘గోహెడ్స్’ స్నాప్‌చాట్స్ ఆధారంగా కాంటాక్టులను యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీన్యాబ్) పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. మారుపేర్లతో ఉన్నోళ్ల వివరాలు సేకరిస్తున్నారు.
ఇందులో హీరో నవదీప్, షాడో సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉప్పలపాటి రవి, డియర్ మేఘా మూవీ డైరెక్టర్ సుశాంత్‌రెడ్డి సహా మరో 37 మందిని ఇప్పటికే గుర్తించారు. అనుమానితులు, బాలాజీ కస్టమర్లకు నోటీసులు ఇచ్చారు. మంగళవారం నలుగురిని విచారించారు.