V6 News

గురుకుల మహిళా డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు

గురుకుల మహిళా డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్​లో కాలేజీల ప్రిన్సిపాల్ ఆర్.పాండురంగ శర్మ, వైస్ ప్రిన్సిపాల్ అనుషతో కలిసి అడ్మిషన్లకు సంబంధించిన వాల్​పోస్టర్లను ఆవిష్కరించారు.

కాలేజీ ఆఫీసులో లేదా అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ నెల 25 తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఈనెల 27 న కౌన్సిలింగ్ నిర్వహించి, జూన్ 1వ తేదీ నుండి తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.