పంజాగుట్టలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు..నిందితుల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు

పంజాగుట్టలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు..నిందితుల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు

పంజాగుట్ట, వెలుగు : పంజాగుట్టలో డ్రగ్స్​దందా చేస్తున్న ముఠాను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ తో కలిసి పంజాగుట్ట పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఒక డ్రగ్ పెడ్లర్​తో పాటు నలుగురు సబ్ -పెడ్లర్లను అరెస్ట్​చేశారు. వీరి నుంచి 10.5 గ్రాముల ఎండీఎంఏ, 7.5 గ్రాముల హైడ్రోపోనిక్ గంజాయి, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

నిందితుల్లో బీరంగూడకు చెందిన డ్రైవర్​కటంగూర్ మహన్ రెడ్డి, ఐటీ ఎంప్లాయ్స్​​రూపానీ ముఖేష్ బాబు, బన్ని, సన్నీ, అమెజాన్​ఉద్యోగి మొహమ్మద్ అబ్దుల్ నబీ అర్షాద్,  ఐటీ స్టూడెంట్​శ్రీరామ్ రవితేజ ఉన్నారు. మరికొందరు పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు. కేసులో నిందితులను పట్టుకున్న సీఐ రామకృష్ణ, ఎస్​ఐ జి.నరేశ్​ను ఏసీపీ మురళీకృష్ణ అభినందించారు.