
- 100 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం
పద్మారావునగర్, వెలుగు: గ్రైండర్(గే డేటింగ్‌యాప్) ద్వారా డ్రగ్స్విక్రయిస్తున్న ఇద్దరిని, వినియోగిస్తున్న ఏడుగురిని ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, చిలకలగూడ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్‌కు చెందిన ఎం.రమాకాంత్ అలియాస్కిరణ్, అచ్చంపేటకు చెందిన ముడావత్ప్రసాద్ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చారు. రమాకాంత్ఓ ప్రైవేట్కంపనీలో ఆఫీస్అసిస్టెంట్గా, ప్రసాద్వాక్యూమ్టెక్నీషియన్గా చేసేవారు. వీరు 2024లో డ్రగ్స్‌కేసులో అరెస్టయ్యారు.
బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా డ్రగ్స్విక్రయిస్తున్నారు. బెంగళూరులో ఓ నైజీరియా పౌరుడి నుంచి గ్రాము ఎండీఎంఏను రూ.4 వేలకు కొనుగోలు చేసి, గ్రైండర్ యాప్ ద్వారా హైదరాబాద్‌లో రూ.10 వేలకు అమ్ముతున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు గురువారం చిలకలగూడ సీతాఫల్‌మండిలోని ఓ అపార్ట్ మెంట్లో తనిఖీలు చేపట్టి ఈ ఇద్దరితోపాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు రమాకాంత్, ప్రసాద్, వినయ్‌కుమార్, డాక్టర్అతిఫ్అబ్దుల్సమీ(సర్జన్), కోతపల్లి మోషా, కేతావత్రాజు నాయక్, షేక్సమీర్, సత్య సురేశ్‌బాబు, వంశీకృష్ణ అందరూ హోమో సెక్స్చేసేవాళ్లేనని తేలిందని డీసీపీ పేర్కొన్నారు.
రాకెట్, పావురం, ఏరోప్లేన్వంటి సింబల్స్ ను డ్రగ్స్రవాణాలో వాడుతున్నారని చెప్పారు. వీరిలో ఐదుగురికి గతంలో పెళ్లిళ్లు జరిగి, విడాకులైనట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 100 గ్రాముల ఎండీఎంఏ, 10 మొబైల్ ఫోన్లు, ఒక చిన్న వేయింగ్ మెషీన్ స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్‌చేసినట్లు పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ అడిషనల్డీసీపీ శ్రీనివాస్‌రావు, ఈస్ట్ జోన్ అడిషనల్డీసీపీ నర్సయ్య, ఏసీపీ శశాంక్‌రెడ్డి తదితరులున్నారు.