బెంగళూరు నుంచి డ్రగ్స్ సరఫరా. .గచ్చిబౌలిలో ముగ్గురు అరెస్ట్

బెంగళూరు నుంచి డ్రగ్స్ సరఫరా. .గచ్చిబౌలిలో ముగ్గురు అరెస్ట్
  •     15 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం

గచ్చిబౌలి: బెంగళూరు నుంచి నగరానికి ఎండీఎంఏ డ్రగ్ తెచ్చి అమ్ముతున్న ముగ్గురిని మాదాపూర్​ ఎస్​ఓటీ, చందానగర్​ పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్​ జోన్​ డీసీపీ రితిరాజ్​ వివరాలను వెల్లడించారు. శేరిలింగంపల్లి బాపునగర్​కు చెందిన డి.హరీశ్​(28), సాయికృష్ణ, సాయి మణికంఠ బెంగళూరులో డ్రగ్స్​ కొనుక్కొని హైదరాబాద్​లో అమ్మేందుకు ప్రయత్నించారు. 

ఈ నెల 23న ఆలిండ్​ ఫ్యాక్టరీ సమీపంలోని ఓ పాన్​ షాప్​ వద్ద ఎండీఎంఏను విక్రయిస్తున్నట్లు తెలియడంతో మాదాపూర్​ జోన్​ ఎస్​ఓటీ, చందానగర్​ పోలీసులు కలిసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రూ. లక్షా 80 వేల విలువైన 15 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.

నార్సింగిలో హెరాయిన్​..

గండిపేట: నార్సింగి మై హోమ్‌‌ అవతార్‌‌ లేబర్‌‌ క్యాంపు వద్ద హెరాయిన్‌‌ విక్రయిస్తుండగా ఎస్‌‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. బెస్ట్‌‌ బెంగాల్‌‌ నుంచి తీసుకువచ్చినట్లు గుర్తించారు. ఆ రాష్ట్రానికి చెందిన దాల్మియా, లక్కన్‌‌ బర్మాను అరెస్టు చేశారు.

గచ్చిబౌలిలో గంజాయి స్వాధీనం..

గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్​లో కూలీలను టార్గెట్​ చేస్తూ గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. సోమవారం గచ్చిబౌలిలోని మాదాపూర్​ జోన్​ డీసీపీ అఫీస్​లో ఎస్​ఓటీ డీసీపీ శోభన్​తో కలిసి మాదాపూర్​ డీసీపీ రితిరాజ్​ వివరాలను వెల్లడించారు. వెస్ట్​ బెంగాల్​కు చెందిన మితున్​ బర్మాన్​(36) పటాన్​చెరులోని ఇస్నాపూర్​లో, సుడెన్​ రాయ్(25) కోకాపేటలో, రెజౌల్​ షేక్​(30) లింగంపల్లిలోని లేబర్​ క్యాంప్​లో ఉంటూ కూలీలుగా పనిచేస్తున్నారు. 

వీరు తమ రాష్ట్రంలో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్​లోని తెల్లాపూర్​ ప్రాంతంలో కూలీలకు అమ్మాలని ప్లాన్​ చేశారు. ముగ్గురు కలిసి వెస్ట్​ బెంగాల్​ నుంచి ట్రైన్​లో సికింద్రాబాద్​కు వచ్చారు. ఆటోల్లో తెల్లాపూర్​ ప్రాంతానికి వెళ్లగా, సమాచారం అందుకున్న మాదాపూర్​ జోన్​ ఎస్​ఓటీ, కొల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద 41.9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

శామీర్​పేట పరిధిలో..

శామీర్ పేట: భద్రాచలం జిల్లా చింతూరు నుంచి హైదరాబాద్ కు గంజాయి తరలిస్తున్న ఐదుగురిని మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. శామీర్ పేట ఓఆర్ఆర్ పై అదుపులోకి తీసుకుని నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.