హైదరాబాద్ సిటీలో డ్రంక్అండ్ డ్రైవ్..వీకెండ్ స్పెషల్ డ్రైవ్..424 మందిపై కేసులు

హైదరాబాద్ సిటీలో డ్రంక్అండ్ డ్రైవ్..వీకెండ్ స్పెషల్ డ్రైవ్..424 మందిపై కేసులు

హైదరాబాద్​ సిటీ వ్యాప్తంగా డ్రంక్​ అండ్​ డ్రైవ్​ స్పెషల్​ డ్రైవ్​ చేపట్టారు సైబరాబాద్​ట్రాఫిక్​ పోలీసులు.  సిటీలోని ప్రధాన ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్​ పోలీసులు...  వీకెండ్స్​ అంటే శనివారం, ఆదివారం రోజుల్లో 424 కేసులు నమోదు చేశారు. 

మాదాపూర్,రాజేంద్రనగర్​, శంషాబాద్​, షాద్​ నగర్​ చేవెళ్ల, నార్సింగి, రాయదుర్గం, మియాపూర్​, కూకట్​పల్లి, బాలానగర్​, జీడిమెట్ల, అల్వాల్​వంటి ప్రాంతాల్లో పెద్దెత్తున డ్రంకర్లు పట్టుబడ్డగారు.డ్రంక్​ అండ్​ డ్రైవ్​  తో ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఇలాంటి సందర్భంలో  BNS 2023 సెక్షన్​ 105 కింద కేసులు నమోదు చేశారు.  వీరికి 10ఏళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించారు.  

హైదరాబాద్​ నగర వ్యాప్తంగా ఆదివారం ( నవంబర్​  23) విస్తృతంగా డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు నిర్వహించారు ట్రాఫిక్​ పోలీసులు. శని, ఆదివారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 424 మందిపై కేసులు నమోదు చేశారు. డ్రంక్​ అండ్​ డ్రైవ్​  తో ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఇలాంటి సందర్భంలో  BNS 2023 సెక్షన్​ 105 కింద కేసులు నమోదు చేశారు.  వీరికి 10ఏళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించారు.  

గత వారం  డ్రంక్​ అండ్​ డ్రైవ్​ లో దొరికిన దాదాపు 800 కేసుల్లో 358 కేసులు పరిష్కారం అయ్యాయి. 304 మందికి జరిమానా విధించింది కోర్టు. 22 మందికి జరిమానాతోపాటు సోషల్​ సర్వీస్​, 32 మందికి జరిమానా, జైలు శిక్ష రెండూ విధించారు.