షాకింగ్ : పొద్దున్నే మందు కొట్టి.. స్కూల్ బస్సులు నడుపుతున్న డ్రైవర్స్

షాకింగ్ : పొద్దున్నే మందు కొట్టి.. స్కూల్ బస్సులు నడుపుతున్న డ్రైవర్స్

స్కూల్ బస్సు.. ఎంతో కేరింగ్.. ఎంత జాగ్రత్త ఉంటుంది.. స్కూల్ బస్సు డ్రైవర్ అంటే ఎంతో అనుభవంతోపాటు సహనం ఉండాలి.. అలాంటి స్కూల్ బస్సు డ్రైవర్లు.. ఉదయాన్నే మందు కొట్టి మరీ బస్సు స్టీరింగ్ పట్టుకుంటున్నారు. బెంగళూరు సిటీలో వెలుగు చూసిన ఈ ఇన్సిడెంట్స్ తో పోలీసులు షాక్ అయ్యారు.. మైండ్ బ్లాంక్ అయ్యింది.. స్కూల్ బస్సు డ్రైవర్లకు ఉదయం పూట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా.. ఏకంగా 23 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు మందు కొట్టి ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది.. పూర్తి వివరాల్లోకి వెళితే...

బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు  జూలై 9  మంగళవారం ఉదయం  7 గంటల నుంచి 9 గంటల వరకు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు.  మొత్తం 3016 పాఠశాల వాహనాలను తనిఖీ చేయగా.. 23 మంది డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయగా పాజిటివ్‌గా తేలిందని పోలీసులు తెలిపారు. వీరిపై మోటారు వాహనాల చట్టం  సెక్షన్ 185 కింద కేసు నమోదు చేసినట్లు బెంగళూరు ట్రాఫిక్ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్  ఎంఎన్ అనుచేత్ తెలిపారు.

 స్పెషల్ డ్రైవ్ లో ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేని 11 వాహనాలను గుర్తించాం. ఈ వాహనాలను సంబంధిత ఆర్టీవో  కార్యాలయాలకు పంపించాం. అంతేగాకుండా  తదుపరి చర్యలకు  డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్ ను   RTO ఆఫీసులకు అందించాం. విద్యార్థులు ,  రహదారి వినియోగదారుల భద్రత కోసం  ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు క్రమం తప్పకుండా కొనసాగుతాయని అనుచేత్ తెలిపారు.