డ్రంకెన్ డ్రైవ్ ప్రాణాంతకం : డీజీపీ రవిగుప్తా

డ్రంకెన్  డ్రైవ్ ప్రాణాంతకం :   డీజీపీ రవిగుప్తా

హైదరాబాద్,వెలుగు:మద్యంతాగి వాహనాలు నడపడం అత్యంత ప్రాణాంతకమని డీజీపీ రవిగుప్తా పేర్కొన్నారు. తాగిన మత్తులో డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ చేయడంతో తమతో పాటు ఎదుటి వారి ప్రాణాలకు కూడా నష్టం చేస్తున్నారన్నారు. డియాజియో సంస్థ అందించిన 50 బ్రీత్‌‌‌‌‌‌‌‌ ఎనలైజర్లను డీజీపీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోలీస్‌‌‌‌‌‌‌‌లు దేశంలోనే నంబర్.1గా నిలిచారన్నారు. సామాజిక బాధ్యతగా డియాజియో అందించిన పరికరాలు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉంతో  ఉపయోగపడతాయన్నారు. బాధ్యతతో వాహనాలు నడపడం ద్వారా తమతో పాటు ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చని అదనపు డీజీపీ(రోడ్‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ) మహేశ్​ భగవత్ అన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిని కట్టడి చేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌‌‌‌‌‌‌‌లు స్పష్టమైన ప్రణాళికతో పని చేస్తున్నారని అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.