తమిళ్ పాలిటిక్స్‎లో సంచలనం: విజయ్‎కు అండగా స్టాలిన్.. కీలుబొమ్మ అంటూ సీఎం ఫైర్

తమిళ్ పాలిటిక్స్‎లో సంచలనం: విజయ్‎కు అండగా స్టాలిన్.. కీలుబొమ్మ అంటూ సీఎం ఫైర్

చెన్నై: టీవీకే పార్టీ చీఫ్, హీరో విజయ్ నటించిన జన నాయగన్ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంపై సీఎం స్టాలిన్ స్పందించారు. ఈ అంశంలో హీరో విజయ్‎కు అండగా నిలిచిన స్టాలిన్ సెన్సార్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖల మాదిరిగానే సెంటర్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కూడా కేంద్రం చేతుల్లో కీలక బొమ్మగా మారిందని విమర్శించారు. అయితే.. తన రాజకీయ విరోధి అయినా విజయ్ కు సీఎం స్టాలిన్ అండగా నిలవడం తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది. 

కాగా, రాజకీయంగా స్టాలిన్, విజయ్ బద్ద శత్రువులు. డీఎంకే అత్యంత అవినీతి ప్రభుత్వమని.. ఆ పార్టీని గద్దె దించడమే తన లక్ష్యమని విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. నిత్యం డీఎంకే సర్కార్, సీఎం స్టాలిన్‎పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. డీఎంకే నేతలు కూడా అంతే ధీటుగా విజయ్‎కు కౌంటర్లు ఇస్తుంటారు. ప్రస్తుతం డీఎంకే, టీవీకే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉండగా.. ఈ తరుణంలో జన నాయగన్ సినిమా విషయంలో సీఎం స్టాలిన్ విజయ్‎కు మద్దతు ఇవ్వడం తమిళ్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

►ALSO REA D | Mega Sankranthi: ఏపీలో 'మన శంకరవరప్రసాద్‌ గారు' టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్! ప్రీమియర్ షో రేటు ఎంతంటే?

దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం జన నాయగన్. సంక్రాంతి పండగను పురస్కరించుకుని 2026, జనవరి 9వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఇదే తన చివరి సినిమా అని విజయ్ ప్రకటించడంతో జన నాయగన్ మూవీపై భారీగా హైప్ నెలకొంది. ఈ క్రమంలో జన నాయగన్ సినిమాకు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సెన్సార్ సర్టిఫికెట్‌ జారీ చేయలేదు. దీంతో జనవరి 9న విడుదల కావాల్సిన జన నాయగన్ విడుదల వాయిదా పడింది. సీబీఎఫ్‎సీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈ మూవీ నిర్మాత మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్.. జన నాయగన్ మూవీకి U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని CBFCను ఆదేశించింది. 

అయితే.. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్‌‎లో ఛాలెంజ్ చేసింది. CBFC అప్పీల్‌ను శుక్రవారం (జనవరి 9) విచారించిన డివిజన్ బెంచ్.. జన నాయగన్ మూవీకి U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అనంతరం ఈ కేసు విచారణను 2026, జనవరి 21కి వాయిదా వేసింది. డివిజన్ బెంచ్ నిర్ణయంతో విజయ్ జన నాయగన్ మూవీ పొంగల్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్నట్లైంది. దీంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.