నిరుద్యోగులెవరూ ఆందోళన చెందొద్దు.. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

నిరుద్యోగులెవరూ ఆందోళన చెందొద్దు.. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: జాబ్ క్యాలెండర్‎పై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందొద్దని.. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపారు. శుక్రవారం (జనవరి 9) ఐఐటీ హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీధర్ బాబు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

 జాబ్ క్యాలెండర్‎పై బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ తొమ్మిది ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీలో ప్రణాళిక బద్దంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. గ్రూప్ 1, 2, 3, 4 ద్వారా ఇప్పటి వరకు 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని ఆయన చెప్పారు. 

►ALSO READ | డీజీపీకి ఊరట..మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నో