మహిళలను ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ మోసం చేసే కేటుగాడిని పోలీసులు పట్టుకున్నారు. ఫిలిం నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రానా ప్రతాప్ అనే వ్యక్తి పబ్స్కు వెళ్లే అమ్మాయిలను టార్గెట్ చేసేవాడు. అలా ఇన్నోసెంట్ గా ఉన్న అమ్మాయి కనిపిస్తే చాలునెమ్మదిగా మాటలు కలిపి ట్రాప్ చేసేవాడు.. కల్లబొల్లి కబుర్లతో మాయమాటలు చెప్పి నమ్మకంగా లోబర్చుకొని తరువాత తన కోరిక తీర్చాలని బ్లాక్ మెయిల్ చేసేవాడు.
అంతేకాదు.. అలా మహిళలను అందినంత డబ్బు దోచుకొనేవాడు. ఓ యువతిని మోసం చేసి రూ. 1.30 కోట్లు దోచుకున్నాడు. తాను మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన మహిళ ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నిందితుడు రానా ప్రతాప్ ను రిమాండ్కు తరలించారు.
