హైదరాబాద్, వెలుగు: రియల్ఎస్టేట్పరిశ్రమ అభివృద్ధి కోసం హైదరాబాద్‌లో బుధవారం హైడ్రేకాన్ 2026 పేరుతో సమావేశం నిర్వహించారు. పరిశ్రమ నిపుణులు, పాలసీ మేకర్స్, డెవలపర్లు, ఆర్కిటెక్టులు, పెట్టుబడిదారులు, టెక్నికల్ ఎక్స్పర్టులను ఇది ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ఈ రంగంలో అభివృద్ధి అవకాశాలు, విధాన పరమైన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానంపై చర్చలు జరిగాయి.
ఈ కార్యక్రమాన్ని నరెడ్కో తెలంగాణ, హైదరాబాద్ రియల్టీ అసోసియేషన్, హైబిజ్ టీవీ నిర్వహించాయి. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన కీలక అంశాలను చర్చించారు.
సీనియర్ లివింగ్ కమ్యూనిటీలలో వ్యాపార అవకాశాలు, లీజర్ లివింగ్, హాస్పిటాలిటీ మెడికల్ టూరిజం రంగాల్లో పెరుగుతున్న అవకాశాలు, వృద్ధి, పర్యావరణ అనుకూల నిర్మాణాల వంటి అంశాలపై నిపుణులు చర్చించారు.
