హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ మహానగరానికి నీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్(ఫేజ్–2) పరిధిలో రిపేర్ పనులు చేపట్టనుండడంతో శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 36 గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మెట్రో వాటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. కోదండాపూర్ నుంచి గొడకండ్ల వరకు ఉన్న పంపింగ్ మెయిన్‌పై 200 మి.మీ.
డయా ఎంఎస్ పై ఏర్పడిన లీకేజీ అరికట్టడం, దెబ్బతిన్న 2,375 మి.మీ. డయా ఎంఎస్ ఎయిర్ టీలు, వాల్వ్‌ల మార్పిడీ, నాసర్లపల్లి వద్ద జంక్షన్ పనులు, వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్న బటర్‌ఫ్లై వాల్వ్‌లు, ఎన్‌ఆర్‌వీలను మార్చడం వంటి కీలక పనులు చేపట్టాల్సి ఉందని అధికారులు తెలిపారు.
నీటి సరఫరా బంద్ ఈ ప్రాంతాల్లోనే..
వనస్థలిపురం, ఆటోనగర్, ఆటోనగర్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు, వైశాలీనగర్, నాగోల్, బడంగ్‌పేట్, లెనిన్‌నగర్, ఆదిబట్ల, కమ్మగూడ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు, బాలాపూర్ రిజర్వాయర్, బర్కాస్, మైసారం పరిధిలోని ప్రాంతాలు, యెల్లుగుట్ట రిజర్వాయర్, నాచారం, తార్నాక, బౌద్ధనగర్, నల్లగుట్ట, లాలాపేట, మర్రెడ్‌పల్లి, ప్రకాష్‌నగర్, పాటిగడ్డ, మేకలమండి, మహేంద్ర హిల్స్ రిజర్వాయర్, మేకలమండి రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు, ఎంఈఎస్, రైల్వేలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధి, హష్మత్‌పేట్, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ, మధుబన్ రిజర్వాయర్, శాస్త్రిపురం, ప్రశాసన్‌నగర్, నేషనల్ పోలీస్ అకాడమీ తదితర ప్రాంతాల్లో పాక్షికంగా నీటి సరఫరా ఉండదని అధికారులు పేర్కొన్నారు.
