అయోధ్యలోని ఆధ్యాత్మిక ప్రదేశాల పవిత్రతను కాపాడటానికి ఉత్తరప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తిగా మాంసాహారం అమ్మకాలను నిషేధించింది. రాంపథ్, ధర్మపథ్, భక్తిపథ్, పంచ-కోసి పరిక్రమ మార్గ్ ప్రాంతాల్లో ఆధ్మాత్మికతను కాపాడాలని నిర్ణయించింది. రామజన్మభూమి అయోధ్యను పవిత్రతను కాపాడేందుకు యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మాంసాహార రెస్టారెంట్లు.. హోటళ్లే కాకుండా ఆన్ లైన్ ఫుడ్ వ్యాపార సంస్థలు కూడా ఈ ప్రాంతాల్లో మాంసాహారాన్ని అమ్మకూడదని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జొమాటో, స్విగ్గీ లాంటి ఆన్‌లైన్ వ్యాపార సంస్థలు కూడా ఈప్రాంతాల్లో మాంసాహారాన్ని విక్రయించకూడదని తెలిపింది.
గెస్ట్‌హౌస్‌లు , ఇళ్లలో కూడా మాంసాహారం అమ్మకాలను నిషేధించింది. ఈ విషయంలో ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందని తెలిపింది.
ఇప్పటికే హోటళ్ళు .. దుకాణాలలో మాంసాహార ఆహారాన్ని అమ్మకండంపై నిషేధం ముందేఉంది. ఆన్‌లైన్‌లో మాంసాహార ఆహారాన్ని ఆర్డర్ చేయడంపై నిషేధం లేదు. అనేక మంది పర్యాటకులు ఆన్‌లైన్ దరఖాస్తుల ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేస్తున్నారని ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజల నుండి అనేక ఫిర్యాదులు అందడంతో యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న యూపీ ప్రభుత్వం.. ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్‌లను కూడా నిషేధించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే చట్ట పరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
