సంక్రాంతికి స్మార్ట్ టివిలపై బంపర్ ఆఫర్స్.. రూ. 20వేలల్లో బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే..

సంక్రాంతికి స్మార్ట్ టివిలపై బంపర్ ఆఫర్స్.. రూ. 20వేలల్లో బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే..

మీరు సంక్రాంతి పండగకి కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా...? రూ. 20 వేల బడ్జెట్‌లో అదిరిపోయే డిస్‌ప్లే, సౌండ్, OTT యాప్స్ సపోర్ట్ చేసే బెస్ట్ టీవీలు కావాలా... అయితే ఇదిగో....  ఈ ఫెస్టివల్ సీజన్ కోసం ఎలక్ట్రానిక్స్ కంపెనీలు అదిరిపోయే అఫర్లు, డిస్కౌంట్స్ తో కస్టమర్లను ఆకర్షించేందుకు రెడీ అయ్యాయి... అవేంటో చూసేయండి... 

Xiaomi 108 cm 43 అంగుళాల FX అల్ట్రా HD 4K స్మార్ట్ LED ఫైర్ టీవీ
Xiaomi 108 cm (43 అంగుళాల) FX అల్ట్రా HD 4K స్మార్ట్ LED ఫైర్ టీవీ ధర రూ. 19,999. బెజెల్-లెస్ డిజైన్‌తో ఇంటర్నల్ స్పీకర్లతో వస్తుంది. ఈ టీవీ మీడియా కాస్టింగ్ కోసం Chromecastకి సపోర్ట్  అలాగే ఐ కంఫర్ట్ మోడ్‌ ఉంది.  

TCL 101 cm 40 అంగుళాల V5C సిరీస్ ఫుల్ HD స్మార్ట్ QLED టీవీ
TCL 101 cm (40 అంగుళాల) V5C సిరీస్ ఫుల్ HD స్మార్ట్ QLED టీవీ 1 GB RAM, 8 GB ROMతో వస్తుంది. 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. Wi-Fi 4 కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీలో కంటి సంరక్షణ ఫీచర్స్, Google అసిస్టెంట్ ఉన్నాయి. ఇంకా ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, Zee5 వంటి యాప్‌లకు సపోర్ట్ చేస్తుంది.

VW 109 సెం.మీ 43 అంగుళాల ప్రో సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ QLED గూగుల్ టీవీ
VW 109 cm (43 అంగుళాల) ప్రో సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ QLED గూగుల్ టీవీ 3840 x 2160 రిజల్యూషన్‌తో 4K అల్ట్రా HD స్క్రీన్ ఇంకా 60 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీనిలో  బ్లూటూత్ 5.0, గూగుల్‌కాస్ట్, ఫాస్ట్‌కాస్ట్, మీటింగ్ మోడ్ వంటి మల్టి కాస్టింగ్ అప్షన్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీలో 2GB RAM, 16 GBస్టోరేజ్ ఇచ్చారు. ఇందులో వాచ్‌లిస్ట్, పర్సనల్ ప్రొఫైల్, కిడ్స్ ప్రొఫైల్ ఇంకా గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంది.

SANSUI 109 సెం.మీ 43 అంగుళాల ఫుల్ HD స్మార్ట్ కూలిటా టీవీ
SANSUI 109 cm (43 అంగుళాల) ఫుల్ HD స్మార్ట్ కూలిటా టీవీ ధర రూ.16,990. దీనిలో డాల్బీ ఆడియో, సరౌండ్ సౌండ్‌తో బెజెల్-లెస్ ఫుల్ HD LED స్క్రీన్‌ ఉంది. ఈ టీవీ కూలిటా టీవీ 3.0పై క్వాడ్-కోర్ ప్రాసెసర్, 512 MB RAM, 4 GB స్టోరేజ్ తో వస్తుంది. Chromecast ఇంటర్నల్ గా ఉంటుంది, కూలింక్ స్మార్ట్ స్క్రీన్ షేరింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 

Acerpure 109 cm 43 అంగుళాల ఎలివేట్ 2024 సిరీస్ QLED స్మార్ట్ Google TV
Acerpure 109 cm (43 అంగుళాలు) ఎలివేట్ 2024 సిరీస్ QLED స్మార్ట్ Google TV రూ. 19,999కు లభిస్తుంది. ఈ టివి Google OSపై నడుస్తుంది, 178-డిగ్రీల వ్యూ, 60 Hz రిఫ్రెష్ రేట్‌తో QLED డిస్ ప్లే ఉంటుంది. DTS స్టూడియో సౌండ్, డాల్బీ అట్మోస్ సపోర్ట్ తో ఆడియో అవుట్‌పుట్ 20W ఉంటుంది.

LG 80 cm 32 అంగుళాల LR600 సిరీస్ స్మార్ట్ webOS IPS LED TV
LG 80 cm (32 అంగుళాల) LR600 సిరీస్ స్మార్ట్ LED టీవీ ధర రూ. 14,989.  స్టీరియో సౌండ్, AI సౌండ్, వర్చువల్ సరౌండ్ సౌండ్ 5.1 అప్ మిక్స్‌తో  20W ఇంటర్నల్ స్పీకర్ సిస్టమ్‌ దీనిలో ఉంది. ఈ టీవీ బ్లూటూత్ సరౌండ్ రెడీ, α5 Gen 6 AI ప్రాసెసర్‌పై నడుస్తుంది. ఇంకా webOS ప్లాట్‌ఫారమ్‌ ఉపయోగిస్తుంది, Wi-Fiకి సపోర్ట్ చేస్తుంది, మ్యాజిక్ రిమోట్‌తో అనుకూలంగా ఉంటుంది.

Samsung 80 cm 32 అంగుళాల వండర్‌టైన్‌మెంట్ సిరీస్ HD రెడీ LED స్మార్ట్ టీవీ
Samsung 80 cm (32 అంగుళాల) Wondertainment Series HD Ready LED స్మార్ట్ టీవీ ధర రూ.14,990.  Samsung TV Plus, Personal Computer Mode,  మీ మొబైల్ స్క్రీన్‌ను షేర్ చేసే సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీలో ఇంటర్నల్ మ్యూజిక్ సిస్టమ్, కంటెంట్ గైడ్, కనెక్ట్ షేర్ మూవీ, వెబ్ బ్రౌజర్, SmartThings యాప్ సపోర్ట్, యూనివర్సల్ గైడ్, TV కీ ఉన్నాయి.

ఒనిడా 108 సెం.మీ 43 అంగుళాల ఫుల్ HD స్మార్ట్ టీవీ
ఒనిడా 108 సెం.మీ (43 అంగుళాల) ఫుల్ HD స్మార్ట్ టీవీ రూ. 16,199కు లభిస్తుంది. 1920 x 1080 రిజల్యూషన్, 60 Hz రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ HD డిస్‌ప్లే ఉంది. స్క్రీన్  178-డిగ్రీల వ్యూ  అందిస్తుంది. ఆడియో సరౌండ్ సౌండ్ సపోర్ట్‌తో బాక్స్ స్పీకర్ల నుండి వస్తుంది.  కూలిటా టీవీలో పనిచేస్తుంది, CC Cast ఇంటర్నల్ గా  ఉంటుంది. సపోర్ట్ చేసే యాప్‌లలో Amazon Prime Video, Disney+ Hotstar, Zee5, Jio Cinema, MX Player, కూలిటా ఛానల్, YouTube ఉన్నాయి.