ఈ 94 పరుగులు చేస్తే.. కోహ్లీ మొనగాళ్లకే మొనగాడు..

ఈ 94 పరుగులు చేస్తే.. కోహ్లీ మొనగాళ్లకే మొనగాడు..

క్రికెట్ రంగంలో మరో హిస్టరీకి దగ్గరలో ఉన్నాడు విరాట్ కోహ్లీ. మరికొన్ని గంటల్లో మొదలయ్యే ఇండియా, న్యూజిలాండ్ వన్డే సిరీస్ లో.. కోహ్లీకి అంతా కలిసి వస్తే.. అనుకున్నట్లు అయితే కొత్త చరిత్ర అతనిపై రికార్డ్ కావటం ఖాయం.. ఇంతకీ కోహ్లీ ఉన్న ఆ అవకాశం ఏంటో తెలుసుకుందామా...

న్యూజిలాండ్ జట్టుతో జరిగిన అన్ని వన్డే మ్యాచుల్లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసింది సచిన్ టెండూల్కర్.
న్యూజిలాండ్ పై 41 ఇన్నింగ్స్ ఆడిన సచిన్.. 46.05 సగటుతో 1750 పరుగులు చేశాడు సచిన్. ఇప్పటి వరకు ఇదే హయ్యస్ట్.

ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో కోహ్లీ ఉన్నాడు. ఇప్పటి వరకు న్యూజిలాండ్ పై 33 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ.. 55.23 సగటుతో.. 1657 పరుగులు చేశాడు. మరో 94 పరుగులు చేస్తే.. సచిన్ పేరుతో ఉన్న హయ్యస్ట్ రికార్డ్ బ్రేక్ అవుతుంది. 

►ALSO READ | మ్యాచ్ జరుగుతుండగా గుండెపోటు.. రంజీ క్రికెటర్ మృతి..

ఇప్పుడు ఇండియా, న్యూజిలాండ్ మూడు వన్డే మ్యాచులు అడనుంది. ఇదే సమయంలో కోహ్లీ మంచి ఫాంలో ఉన్నాడు. 2026, జనవరి 11వ తేదీ ఆదివారం వడోదరలో జరిగే వన్డే మ్యాచులో 94 పరుగులు చేస్తే.. న్యూజిలాండ్ పై కోహ్లీ కొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్లు అవుతుంది. సచిన్ రికార్డ్ ను బ్రేక్ చేసినట్లు ఉంటుంది. 

వడోదర మ్యాచ్ మిస్ అయినా.. మిగతా రెండు వన్డేలతో కలుపుకుని ఈ మూడు వన్డే మ్యాచుల్లో 94 పరుగులు చేసినా.. సచిన్ రికార్డ్ బ్రేక్ చేసినట్లే అవుతుంది. ఎటు చూసినా.. ఈ వన్డే సిరీస్ తో.. న్యూజిలాండ్ పై కోహ్లీ కొత్త రికార్డ్ క్రియేట్ చేయటం ఖాయం. కివీస్ జట్టుపై టీమిండియాలో మొనగాళ్లకే మొనగాడు ఎవరు అంటే విరాట్ కోహ్లీ అని చెప్పుకోవటం ఖాయం.. ఇక మిగిలింది విజయోస్తు..