ఇండియన్ క్రికెట్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది... మ్యాచ్ జరుగుతుండగా గుండెపోటు రావడంతో రంజీ క్రికెటర్ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మిజోరంకు చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ 38 ఏళ్ళ లాల్రేముట్రా మ్యాచ్ జరుగుతుండగా గుండెపోటుతో మరణించాడు. ఐజ్వాల్ సమీపంలోని సీహ్ముల్ లో జారుతున్న స్క్రీనింగ్ టోర్నమెంట్ లో జరిగింది ఈ ఘటన. ఈ టోర్నీలో వెంగ్నువాయ్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్న లాల్రేముట్రా బుధవారం ( జనవరి 7 ) చాన్పుయి క్రికెట్ క్లబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఒక్కసారిగా కుప్పకూలాడు.
మ్యాచ్ జరుగుతుండగా కుప్పకూలిన లాల్రెముట్రాను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు నిర్దారించారు డాక్టర్లు. లాల్రెముట్రా మృతి పట్ల తీవ్ర డిఫ్బ్రాంతి వ్యక్తం చేసింది క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ మిజోరం.లాల్రెమ్రుటా రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో మిజోరంకు ప్రాతినిధ్యం వహించాడని.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఏడు మ్యాచ్‌లు ఆడాడని తెలిపింది సీఏఎం.
రాష్ట్ర స్ధాయిలో కూడా చాలా మ్యాచ్‌లలో తన ప్రతిభను చాటుకున్నాడని తెలిపింది సీఏఎం.మిజోరం ఒక గొప్ప క్రికెటర్ ను కోల్పోయిందని... లాల్రెమ్రుటా కుటంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని పేర్కొంది సీఏఎం.
