రాంగ్రూట్లో స్కూల్ బస్సులు .. 137 వాహనాలపై కేసులు నమోదు

రాంగ్రూట్లో స్కూల్ బస్సులు .. 137 వాహనాలపై కేసులు నమోదు
  • డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో దొరికిన లిటిల్ ​ఫ్లవర్ ​స్కూల్​ బస్ ​డ్రైవర్​ 

హైదరాబాద్​ సిటీ, వెలుగు: పరిమితికి మించి పిల్లలను తీసుకెళ్తున్న స్కూల్​ ఆటోలు, వ్యాన్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బుధవారం సెంట్రల్ జోన్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఖైరతాబాద్, అబిడ్స్,  చిక్కడపల్లి, గాంధీనగర్, ఇందిరా పార్క్ రోడ్ లో స్కూల్​వాహనాలను ట్రాఫిక్ ఏసీపీ ఎస్. మోహన్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఇందులో లిటిల్ ఫ్లవర్ స్కూల్‌ కు చెందిన  పిల్లలను తీసుకువస్తున్న వ్యాన్​ డ్రైవర్ రాజు డ్రంకన్​డ్రైవ్​లో దొరికాడు. ఇతడిని చెక్​చేయగా181 రీడింగ్ రావడంతో కేసు నమోదు చేశారు. 

అలాగే పరిమితికి మించి పిల్లలను తరలిస్తున్నందుకు రెండు కేసులు, అనధికార వ్యక్తులు ఉన్నందుకు ఆరు కేసులు,  యూనిఫామ్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నందుకు తొమ్మిది కేసులు, రాంగ్​రూట్​లో వస్తున్నందుకు 137 బస్సులపై కేసులు నమోదు చేశారు.