కొత్త కొత్త వింతలు : తాగి.. రోడ్డు అనుకుని రైలు పట్టాలపైకి వెళ్లిన కారు డ్రైవర్..

కొత్త కొత్త వింతలు : తాగి.. రోడ్డు అనుకుని రైలు పట్టాలపైకి వెళ్లిన కారు డ్రైవర్..

మద్యం మత్తులో   రైల్వేట్రాక్‌పై కారు నడిపి చివరికి జైలుపాలయ్యాడు ఓ ప్రబుద్దుడు .. పరిమితికి మంచి మద్యం సేవించిన ఆ వ్యక్తి దాదాపు 15 కిలోమీటరు దాకా రైల్వేట్రాక్‌పై కారు నడిపాడు. .. ఈ ఘటన  కేరళలోని కన్నూరు రైల్వే ట్రాక్ పై  తాజాగా చోటుచేసుకుంది. అఘటనకు సంబంధించి వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. బ్రీత్ ఎనలైజర్‌ పరీక్షలో లీటరుకు 0.85 మిగ్రా ఆల్కాహాల్‌ ఉన్నట్టుగా తేలింది..ఇది చట్టపరంగా అనుమతి ఉన్న పరిమితికి మూడు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు గానూ, పోలీసులు ఆయనను  అరెస్టుచేసి కేసు నమోదు చేశారు.

మద్యం సేవించి బైక్ నడపాలంటే చాలా కష్టం..  ఇక కారైతే రోడ్డుపై వెళుతున్నామా.. పక్కన ఉన్న పొదల్లో వెళ్తున్నామా కూడా తెలియని పరిస్థితి.  కొన్ని ప్రాంతాల్లో పగలు కారు డ్రైవ్ చేయాలంటేనే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అదే రాత్రి సమయాల్లో అయితే చాలా కష్టం.  చాలా చోట్ల రోడ్డు పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. ఇప్పుడు అసలు విషయానికొస్తే.. కేరళలోని కన్నూరు రైల్వే ట్రాక్ పై ఓ కారును పోలీసులు గుర్తించారు.  అక్కడకి వెళ్లి చూడగా ఓ వ్యక్తి బాగా మద్యం సేవించి డ్రైవింగ్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు.   డ్రింక్ చేసి రైలు పట్టాలపై కారును డ్రైవ్ చేస్తున్నాడంటే అతని పరిస్థితి ఎలా ఉందో చెప్పనక్కరలేదు.  సదరు వ్యక్తిని అంజరకండి ప్రాంతానికి చెందిన జయప్రకాష్‌గా గుర్తించారు.  అతనిపై  కన్నూర్ సిటీ పోలీసులు ఎంవీఐ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.   థాజే చొవ్వా రైల్వే క్రాసింగ్ సమీపంలో రైలు ట్రాక్ మధ్యలో కారు ఇరుక్కుపోయి నట్లుగా వీడియోలో ఉంది.రైల్వే క్రాసింగ్ వద్ద ఉన్న సిబ్బంది ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.  రైల్వే సిబ్బంది సమాచారం మేరకు జయప్రకాష్‌ను అరెస్టు చేసి తరువాత  బెయిల్‌పై విడుదల చేశారు.  మద్యం మత్తులో  జయప్రకాష్ అనే వ్యక్తి గేర్ మార్చడానికి ప్రయత్నించడం..  డ్రైవింగ్ ను  కొనసాగించడానికి స్టీరింగ్ పట్టుకున్నాడు.   రైల్వే ట్రాక్‌పై దాదాపు 15 మీటర్ల వరకు వాహనాన్ని నడిపాడని అధికారులు తెలిపారు.