తెలంగాణలో త్వరలో డ్రైపోర్ట్​

తెలంగాణలో త్వరలో డ్రైపోర్ట్​
  •     టీఎస్​ఐఐసీ ఎండీ విష్ణువర్ధన్​

హైదరాబాద్​, వెలుగు : తీర ప్రాంతం లేని తెలంగాణ రాష్ట్రంలో త్వరలో డ్రైపోర్ట్​ఏర్పాటు కానుందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మౌలిక సదుపాయాల కార్పొరేషన్​ (టీఎస్​ఐఐసీ) ఎండీ డాక్టర్​ విష్ణువర్ధన్​ రెడ్డి తెలిపారు.  దీనికి అవసరమైన భూమిని సేకరించామని, భవిష్యత్తులో రాబోయే రెండు నుంచి మూడు అదనపు డ్రై పోర్ట్‌‌ల నిర్మాణం కోసం కూడా పని చేస్తున్నామని ఆయన వెల్లడించారు. హైదరాబాద్​లో ఫెడరేషన్​ ఆఫ్​ తెలంగాణ చాంబర్స్​ ఆఫ్​ కామర్స్​ అండ్​ ఇండస్ట్రీ (ఎఫ్​టీసీసీఐ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ

‘‘త్వరలో మనరాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్‌‌షిప్‌‌  కూడా ఏర్పాటు కాబోతోంది. హైదరాబాద్‌‌కు ఔటర్ రింగ్ రోడ్డు వల్ల భారీ ప్రయోజనం ఉంది.   రీజనల్​ రింగ్ రోడ్​తోనూ ఎన్నో లాభాలు ఉంటాయి. ఇది 340 కిలోమీటర్ల మేర ఏర్పాటవుతుంది. లాజిస్టిక్స్‌‌లో ఎంఎస్​ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయి” అని వివరించారు.