తెలంగాణలో డీఎస్సీ ఎగ్జామ్స్ ప్రారంభం

తెలంగాణలో డీఎస్సీ ఎగ్జామ్స్  ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి(జూలై 18) నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో ఎగ్జామ్ నిర్వహించున్నారు.  ఉదయం 9గంటల నుంచి 11.30 వరకు మొదటి సెషన్ ఉంటుంది. మధ్యాహ్నం 2గంటలకు నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. మొదటి సారి ఆన్లైన్ విధానం ద్వారా జరుగుతున్న డీఎస్సీ ఇది.  

ALSO READ : ఇండియన్ నేవీలో క్యాడెట్ ఎంట్రీ స్కీమ్

ఒక్కో సెషన్ లో 13వేల మది చొప్పున అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మరోవైపు డీఎస్సీ పరీక్షల నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 14 జిల్లాల్లో 54 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పాఠశాఖ విద్యాశాఖ తెలిపింది. బయోమెట్రిక్ కారణంగా గంటన్నర ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేశారు.