సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో బంగారు నగలు పట్టివేత : డీఎస్పీ జావెద్​

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో బంగారు నగలు పట్టివేత : డీఎస్పీ జావెద్​
  • 188.80 గ్రాముల ఆభరణాలు స్వాధీనం 

సికింద్రాబాద్​,వెలుగు:  లోక్ సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎలాంటి ఆధారాలు లేకుండా బంగారు ఆభరణాలు తరలిస్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రూ.13.16లక్షల విలువైన 188.80 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే అర్బన్​డీఎస్పీ ఎన్​. జావెద్​శుక్రవారం మీడియాకు వివరాలు తెలిపారు. సికింద్రాబాద్​రైల్వే ఇన్​స్పెక్టర్​సాయి ఈశ్వర్​గౌడ్​సిబ్బందితో ఉదయం 6.30గంటలకు  రైల్వేస్టేషన్​లో తనిఖీలు చేస్తున్నారు. 

ప్లాట్​ఫామ్  -4 వద్ద ఓ వ్యక్తి  బ్యాగుతో అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. అతని బ్యాగును చెక్ చేశారు. అందులో  188.80గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి.  అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా  చార్మినార్​కాళీ కమాన్​ ప్రాంతానికి చెందిన మనబ్​హుదాయత్​(34)గా తెలిపాడు. నగలు గుంటూరుకు తీసుకెళ్తున్నానని జన్మభూమి ఎక్స్​ప్రెస్​ కోసం ఎదురుచూస్తున్నట్టు అతడు వెల్లడించాడు.  నగలకు రసీదులు, ఇతర ఆధారాలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకుని ఇన్​కమ్ ట్యాక్స్​ అధికారులకు అప్పడించినట్టు డీఎస్పీ జావెద్​తెలిపారు. అదేవిధంగా రైల్వే పోలీసులు గత మార్చి 16 నుంచి మే 24 వరకు చేపట్టిన తనిఖీల్లో రూ.1. 44  కోట్ల విలువైన  ఆభరణాలు, నగదు పట్టుకున్నారు.