కాంగ్రెస్ లో చేరేది నేను కాదు.. నా కొడుకు : డీఎస్

కాంగ్రెస్ లో చేరేది నేను కాదు.. నా కొడుకు : డీఎస్

కాంగ్రెస్ లో  చేరుతున్నారనే వార్తలపై  సీనియర్ నేత డీ. శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు.  తాను కాంగ్రెస్ లో చేరడం లేదని ప్రకటించారు . తన పెద్ద కొడుకు సంజయ్ తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నారని స్పష్టం చేశారు.  కాంగ్రెస్ లో చేరనున్న తన పెద్ద కొడుకు సంజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. తన ఆరోగ్యం సహకరిస్తే గాంధీ భవన్ కు వెళ్లి సంజయ్ ని  ఆశీర్వదీస్తానని చెప్పారు.  ఇప్పటికే తన చిన్న కొడుకు అర్వింద్ ఎంపీగా ప్రజాసేవలో ఉన్నాడని చెప్పారు.  తన కుమారులు ఎక్కడున్నా వారికి తన ఆశీస్సులుంటాయని తెలిపారు. పార్టీలు వేరైనా తన కుమారులు ప్రజల కోసం పనిచేస్తున్నారని వెల్లడించారు.