వైఎస్ కుటుంబం గురించి నేను తప్పుగా మాట్లాడలేదు

వైఎస్ కుటుంబం గురించి నేను తప్పుగా మాట్లాడలేదు

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి తాను చేసిన కామెంట్స్‌‌ను తప్పుగా ప్రచారం చేస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే, జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల ఇంచార్జ్ రఘునందన్ రావు అన్నారు. తాను అనని మాటలను అన్నట్లు ప్రచారం చేస్తున్నారని రఘునందన్ మండిపడ్డారు. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం గురించి సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలను ఆ కుటుంబానికి గుర్తు చేశా. అంతేగాని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌‌ను, అందులోనూ చనిపోయిన వ్యక్తి గురుంచి నేను తప్పుగా మాట్లాడలేదు. నా మాటలు ఎవరినైనా బాధిస్తే తప్పుగా అర్థం చేసుకోవద్దు. వైఎస్సార్ అభిమానులు వాస్తవాలను గ్రహించాలి. ప్రజలు, వైఎస్సార్ కుటుంబీకులతోపాటు ఆయన అభిమానులు.. కేసీఆర్ రాజకీయ స్వార్థాన్ని గ్రహించాలి’ అని రఘునందన్ పేర్కొన్నారు.