Kalki 2898 AD Postpone: ఎన్నికల ఎఫెక్ట్.. కల్కి 2898AD వాయిదా తప్పదా!

Kalki 2898 AD Postpone: ఎన్నికల ఎఫెక్ట్.. కల్కి 2898AD వాయిదా తప్పదా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD). హిందూ మైథాలజీ బ్యాక్డ్రాప్ లో స్కైఫై ఎలిమెంట్స్ తో రానున్న ఈ సినిమాను టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె(Deepika Padukone) హీరోయిన్ గా నటిస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల వైజయంతి మూవీ ప్రతిష్టాత్మంకంగా నిర్మిస్తున్న కల్కి సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, దిశా పటాని తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో తెరక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా మే 9న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. అయితే ఈ డేట్ కి వైజయంతి మూవీస్ బ్యానర్ కి ఒక సెంటిమెంట్ ఉంది. అదేంటంటే.. వైజయంతి మూవీ బ్యానర్లో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మే 9న వచ్చి భారీ విజయాన్ని సాధించింది. అందుకే అదే డేట్ కి కల్కి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. 

అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు చేస్తుంటే కల్కి సినిమా మే 9న రావడం కష్టంగానే అనిపిస్తోంది. కారణం.. తాజాగా దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 19న తొలి విడత పోలింగ్‌ జరగనుంది. అందులో.. మే 13న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌, మే 7న 12 రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. కాబట్టి.. పాన్‌ ఇండియా లెవల్లో  విడుదల కానున్న కల్కి సినిమాకు ఈ ఎన్నికలు ఆటంకంగా మారే అవకాశం కనిపిస్తోంది. అందుకే.. మే 9న కల్కి విడుదల కావడం దాదాపు ఖాయంగానే అనిపిస్తోంది.

ఏదేమైనా పరవాలేదు సినిమాను రిలీజ్ చేస్తాం అనుకుంటే మాత్రం కలెక్షన్స్ భారీగా తగ్గే అవకాశం ఉంది. ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటుంది కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ సైతం సినిమాను చూసే వీలు ఉండదు. ఇలా ఎన్ని రకాలుగా చూసినా కల్కి సినిమాను వాయిదా వేయడమే సబబుగా కనిపిస్తోంది. కాబట్టి.. మేకర్స్ కూడా ఇదే ఆలోచనలో ఉండే అవకాశం ఉంది. మరో రెండు రోజుల్లో ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకరకంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.