దుల్కర్ హీరోగా నటిస్తున్న 41వ సినిమా అప్డేట్

దుల్కర్ హీరోగా నటిస్తున్న 41వ సినిమా అప్డేట్

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌‌‌‌ ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నాడు.  వాటిలో రవి నేలకుదిటి దర్శకత్వం వహిస్తున్న మూవీ ఒకటి. ఎస్‌‌‌‌ఎల్వీ సినిమాస్‌‌‌‌ బ్యానర్‌‌‌‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దుల్కర్ హీరోగా నటిస్తున్న 41 చిత్రమిది. పూజా హెగ్డే హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. 

తాజాగా ఈ మూవీ షూటింగ్‌‌‌‌కు సంబంధించిన కీలక షెడ్యూల్ పూర్తయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన టీమ్..  మంచుతో కప్పుకున్న అద్భుతమైన ప్రకృతి మధ్య కీలక షెడ్యూల్‌‌‌‌ను కంప్లీట్ చేశామని తెలియజేశారు.

ఈ సందర్భంగా సెట్స్ నుంచి విడుదలైన ఫోటోలు  ఆకట్టుకుంటున్నాయి.  వింటర్ అవుట్ ఫిట్స్‌‌‌‌లో దుల్కర్, పూజా హెగ్డే తమ అందమైన ప్రెజెన్స్‌‌‌‌తో ప్రత్యేకంగా కనిపించారు. ఇక  నెక్స్ట్ షెడ్యూల్‌‌‌‌ను   త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అలాగే ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌‌‌‌మెంట్ కూడా  కొన్ని రోజుల్లో ఉండబోతుందని హింట్ ఇచ్చారు.

లవ్ స్టొరీతో పాటు అద్భుతమైన హ్యుమన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.  ఈ చిత్రంలో  సీనియర్ నటి రమ్యకృష్ణ,  జగపతిబాబు, దీక్షిత్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్టు తెలుస్తోంది.  జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.