సౌతాప్రికా సంచలనం..జేపీ డుమీనీ కీలక నిర్ణయం

సౌతాప్రికా సంచలనం..జేపీ డుమీనీ కీలక నిర్ణయం

కేప్‌ టౌన్‌: సౌతాఫ్రికా సంచలనం, ఆల్ రౌండర్ ప్లేయర్ డుమినీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వన్డే మ్యాచ్ లకు గుడ్ బై చెప్పేశాడు. వరల్డ్‌ కప్ తర్వాత వన్డే ఫార్మాట్‌ లో ఆడటంలేదని తెలిపాడు. ఈ విషయాన్ని శుక్రవారం ప్రకటించిన డుమినీ.. టీ20 ఫార్మాట్‌ లో మాత్రం కొనసాగుతానని చెప్పాడు. 2017లో టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకున్న డుమినీ, లేటెస్ట్ గా వన్డే ఫార్మాట్‌ కు గుడ్ బై చెప్పేశాడు. ఈ వరల్డ్ కప్ తనకు ఎంతో కీలకంగా చెప్పాడు. వన్డేల్లో తనకు వరల్డ్‌ కప్‌ చివరిదంటూ డుమినీ ప్రకటించాడు.

ఈ సందర్భంగా మాట్లాడిన డుమినీ..‘గత కొన్నినెలలుగా నా వన్డే రిటైర్మెంట్‌ పై ఆలోచనలో పడ్డా. వన్డేలకు గుడ్‌ బై చెప్పే సమయం వచ్చేసిందని బలంగా నమ్ముతున్నా. వరల్డ్‌ కప్‌ తర్వాత తప్పుకోవడానికి సిద్ధమయ్యా. ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా సతమతమయ్యా. ఫ్యామిలీతో మరింత ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే వన్డేలు చాలనుకున్నా. అంతర్జాతీయ, దేశవాళీ టీ20 ఫార్మాట్‌ లో కొనసాగుతా’ అని డుమినీ తెలిపాడు.

ఇప్పటివరకూ డుమినీ 193 వన్డేలు ఆడగా 37. 39 సగటుతో 5,047 రన్స్ చేశాడు. బౌలింగ్‌ లో 68 వికెట్లు సాధించాడు. రాబోయే వరల్డ్‌ కప్‌ డుమినీకి మూడోది. గతంలో 2011, 2015 వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో డుమినీ అద్భుతంగా రాణించాడు. డుమినీ టీమ్ లో ఉన్నాడంతో మ్యాచ్ గెలిచేస్తుంది అనే కాన్ఫిడెన్స్ కలిగేది. ఈజీగా సిక్సర్లు బాదుతూ క్రికెట్ ఫ్యాన్స్ ను ఆకట్టుకునేవాడు.