దసరా  బరిలో బాలయ్య మూవీ..

దసరా  బరిలో బాలయ్య మూవీ..

సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న బాలకృష్ణ.. విజయదశమికి తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.  ఉగాది సందర్భంగా  బాలయ్య ఫస్ట్‌‌లుక్‌‌తో అంచనాలు పెంచిన టీమ్.. శుక్రవారం సినిమా రిలీజ్‌‌ డేట్‌‌ని ప్రకటించి ఫ్యాన్స్‌‌ని మరింత ఖుషి చేసింది. ‘విజయదశమికి ఆయుధ పూజ’ అని అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఇంటెన్స్ లుక్‌‌లో  కనిపిస్తున్నారు బాలకృష్ణ. పోస్టర్‌‌‌‌లో  కాళీమాత విగ్రహం కూడా కనిపించడంతో ఈ సినిమాలో బాలయ్యను పవర్‌‌‌‌ఫుల్‌‌ క్యారెక్టర్‌‌‌‌లో చూపించబోతున్నట్టు అర్ధమవుతోంది.  బాలకృష్ణ నటిస్తోన్న 108వ సినిమా ఇది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌‌. శ్రీలీల ఇంపార్టెంట్ రోల్‌‌ పోషిస్తోంది.  సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’తో పాటు రామ్, బోయపాటి కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం కూడా  దసరా బరిలో ఉన్నాయి.