దేశంలో తగ్గిన నగదు చలామణీ

దేశంలో తగ్గిన నగదు చలామణీ

గతంలో క్యాష్ లేదా చెక్ ల రూపంలోనే  ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్లు. అయితే, టెక్నాలజీ పెరిగి డిజిటల్ పేమెంట్ ఆప్షన్స్ వచ్చాక ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్సే చేస్తున్నారు. మన దేశంలో కూడా ప్రజలు డిజిటల్ పేమెంట్స్ కే ఎక్కువ అలవాటు పడిపోయారు. దాంతో దేశంలో నగదు చలామణీ బాగా తగ్గిపోయింది.

దీపావళి పండగ రోజుల్లో రూపాయలు 7,600 కోట్ల వరకు నగదు చెలామణీ తగ్గింది. గత ఇరవై ఏండ్లలో నగదు చెలామణీ ఇంతలా తగ్గడం ఇదే మొదటిసారని ఎస్‌బీఐ ఆర్థిక వేత్తలు చెప్తున్నారు. దేశంలో ప్రజలు ఎక్కువగా డిజిటల్‌ పేమెంట్స్ పై ఆధారపడటమే ఇందుకు కారణం. ఈ మధ్య ప్రతీ చిన్న ట్రాన్సాక్షన్ కూడా ఆన్ లైన్ లోనే చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థపై మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనివల్ల బ్యాంకింగ్ రంగంలో నగదు నిల్వలు తగ్గుతాయి. డిపాజిట్లు ఆగి, నగదు దొరకడం కష్టంగా మారుతుంది. గతంలో కూడా (2009 దీపావళి) నగదు చెలామణీ 950 కోట్లు తగ్గింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంలో వచ్చిన మాంద్యమం కూడా నగదు చలామణీ తగ్గడానికి కారణం కావచ్చు. అందువల్లే దేశ ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.