
DUSU.. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు జరిగాయి. దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపిన ఈ ఎన్నికల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP).. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) పోటాపోటీగా బరిలోకి దిగాయి. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు అంటే పార్లమెంట్, అసెంబ్లీకి జరిగినంత హంగామా ఉంటుంది అక్కడ. ప్రతి వింగ్ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతుంది. అందులో కుర్రోళ్లు.. కసిగా బరిలోకి దిగుతారు.
2025, సెప్టెంబర్ 19వ తేదీన వచ్చిన ఫలితాల్లో ABVP నుంచి అధ్యక్షుడిగా బరిలోకి దిగిన ఆర్యన్ మాన్ గెలుపొందాడు. ఆర్యన్ మాన్ కు 24 వేల 476 ఓట్లు వస్తే.. NSUI నుంచి అధ్యక్షుడిగా బరిలోకి దిగిన జోస్లిన్ నందితా చౌదరికి కేవలం 10 వేల 814 ఓట్లు మాత్రమే వచ్చాయి. 10 వేల ఓట్ల ఆధిక్యంతో ABVP ఆర్యన్ మాన్ గెలుపొందాడు. ఇక్కడి వరకు ఓకే.. ఇప్పుడు ఆర్యన్ మాన్ ఎవరు.. అతని ఫ్యామిలీ హిస్టరీ ఏంటీ.. ABVP అతన్ని ఎందుకు అధ్యక్షుడిగా బరిలోకి దింపింది అనే వివరాలు బయటకు వచ్చిన తర్వాత.. అందరూ షాక్.. ఓ మైడ్ గాడ్ అంటున్నారు.
ఆర్యన్ మాన్ ఎవరు..?
23 ఏళ్ల ఆర్యన్ మాన్.. ఆషామాషీ కుర్రోడు ఏమీ కాదు. అతని ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ చాలా పెద్దది. లిక్కర్ వ్యాపార కుటుంబం. అతని తండ్రి సికందర్ మాన్ కు రాయల్ గ్రీన్ అనే లిక్కర్ బ్రాండ్ ఉంది. హర్యానా రాష్ట్రంలో వీళ్లకు లిక్కర్ షాపులు ఉన్నాయి. లిక్కర్ తయారీ, అమ్మకాల్లో వీళ్ల కుటుంబం వేల కోట్ల టర్నోవర్ చేస్తుంది. హర్యానా రాష్ట్రంలోని బెరీలో ADS సంస్థ వీళ్లదే.
ఇక ఆర్యన్ మాన్ జాతీయ స్థాయిలో ఫుట్ బాల్ ప్లేయర్. స్పోర్ట్స్ కోటా కింద ఢిల్లీ యూనివర్సిటీలో సీటు పొందాడు.
ALSO READ : ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్..
ఎన్నికల ప్రచారంలోనే చరిత్ర సృష్టించిన ఆర్యన్ మాన్ :
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల ప్రచారం.. ఈసారి కనీవినీ ఎరుగని విధంగా సాగింది. గతంలో ఎప్పుడూ ఇంత హై ఫ్రొఫైల్ లో ప్రచారం జరగలేదని.. ఆర్యన్ మాన్ తన ప్రచారాన్ని హైటెక్ హంగులతో చేశాడని గతంలోనే కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. విదేశీ కార్లతో ర్యాలీలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల స్థాయిలో క్యాంపెయిన్ నిర్వహించటం అనేది ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల చరిత్రలో ఫస్ట్ టైం అంటూ సోషల్ మీడియాలో చాలా పోస్టులు దర్శనం ఇస్తున్నాయి.
మొత్తానికి ఓ లిక్కర్ వ్యాపారి కుటుంబం నుంచి.. వేల కోట్ల ఆస్తుల సామ్రాజ్యం నుంచి కుర్రోడు.. ABVP తరపున ఢిల్లీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు కావటం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ గా నడుస్తున్న చర్చ.