కేపీహెబ్బీ లో డ్వాక్రా మహిళల ధర్నా

కేపీహెబ్బీ లో డ్వాక్రా మహిళల ధర్నా

కూకట్​పల్లి, వెలుగు:  కేపీహెచ్​బీ కాలనీ రెండో ఫేజ్​లోని ధనలక్ష్మి సెంటర్ వద్ద బుధవారం డ్వాక్రా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దాదాపు పదేండ్లుగా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని తొలగించి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్​కు కేటాయించేందుకు జీహెచ్‌‌ఎంసీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.