ఒక్కో సీటుకు నలుగురైదుగురే పోటీ!

ఒక్కో సీటుకు నలుగురైదుగురే పోటీ!
  • ఈ ఏడాది అందుబాటులోకి 1,500 సీట్లు
  • 6,540కి చేరనున్న మొత్తం సీట్లు
  • ఒక్కో సీటుకు నలుగురైదుగురే పోటీ!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లకు ప్రతీ ఏడాది కాంపిటీషన్​ తగ్గుతూ వస్తున్నది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఖ్య, సీట్ల సంఖ్య పెరుగుతుండటంతో ఒక్కో సీటుకు పోటీపడే వారి సంఖ్య కూడా తగ్గుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కో సీటుకు15 మందిపైనే పోటీపడేవారు. గతేడాది నాటికి ఒక్కో సీటుకు ఆరుగురు మాత్రమే పోటీ పడ్డా రు. ఈసారి కాంపిటీషన్​ మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 5,040 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, ఈ ఏడాది కొత్తగా సుమారు 1,500 సీట్లు యాడ్ అవుతున్నాయి. ఇందులో 1,200 సీట్లు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి కాలేజీల్లో, మరో 300 సీట్లు ప్రైవేటు కాలేజీల్లో అందుబాటులోకి రానున్నాయి. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 6,540కి చేరనుంది. దేశవ్యాప్తంగా కూడా ఎంబీబీఎస్ సీట్ల  సంఖ్య భారీగా పెరిగింది. గతేడాది 91 వేల సీట్లు ఉండగా, ఈసారి లక్ష వరకు పెరిగే చాన్స్​ ఉంది. ఇందులో 51వేల సీట్లు ప్రభుత్వ కాలేజీల్లోనివే కాగా, వీటిల్లో 15 శాతం సీట్లకు మన రాష్ట్ర విద్యార్థులు కూ డా పోటీ పడొచ్చు. దీంతో ఈసారి రాష్ట్రంలో, దేశంలో మెడికల్ సీట్లకు కాంపిటీషన్ తగ్గే చాన్స్​ ఉందని అధికారులు భావిస్తున్నారు. మన రాష్ట్రంలో ఒక్కో సీటుకు నలుగురైదుగురికి మించి పోటీ ఉండకపోవచ్చని చెబుతున్నారు. అయితే, మన రాష్ట్రంలోని మహావీర్‌‌‌‌‌‌‌‌, ఎంఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌, టీఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ కాలేజీల పర్మిషన్‌‌‌‌ను నేషనల్ మెడికల్ కమిషన్‌‌‌‌ క్యాన్సిల్ చేసింది. ఈ క్యాన్సిలేషన్‌‌‌‌ 2021–22 అకాడమిక్ ఇయర్‌‌‌‌‌‌‌‌కే పరిమితమా, 2022–23 అకాడమిక్‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌కు కూడా కొనసాగిస్తారా..? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ ఈ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వకపోతే 450 సీట్లకు కోత పడుతుంది.

కౌన్సెలింగ్ ఇలా..

గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను నేషనల్ కోటాలో భర్తీ చేస్తారు. దేశంలోని ఏ ప్రాంత స్టూడెంట్స్​అయినా ఈ 15 శాతం సీట్లకు పోటీ పడొచ్చు. జాతీయ స్థాయిలో సాధించిన ర్యాంకుల ఆధారంగా ఈ సీట్లను కేటాయిస్తారు. ఎయిమ్స్ సీట్లను కూడా ఆలిండియా ర్యాంకుల ప్రకారమే కేటాయిస్తారు. నేషనల్ కోటాకు ఇచ్చిన15 శాతం సీట్లు పోగా మిగిలిన ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లోని అన్ని సీట్లను స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవల్ ర్యాంకుల ఆధారంగానే కేటాయిస్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఈడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వేషన్లను పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ కాలేజీల్లోని అన్ని సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని యాభై శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రైవేటు కాలేజీల్లోని మిగిలిన యాభై శాతం సీట్లను మేనేజ్‌‌‌‌మెంట్ కోటా, ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐ కోటా కింద విభజించి భర్తీ చేస్తారు.

ర్యాంక్ లక్ష దాటినా.. 

ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరగడంతో ఆలిండియా ర్యాంక్ లక్ష దాటిన వాళ్లకు కూడా  కన్వీనర్​ కోటాలో సీట్లు దక్కుతున్నాయి. జాతీయ స్థాయిలో 60వేల ర్యాంకు వచ్చినోళ్లకూ నిరుడు ఓపెన్ కేటగిరీలో సీటు దొరికింది. ఎస్సీ కేటగిరీలో 1.61 లక్ష ర్యాంకు వరకు, ఎస్టీ కేటగిరీలో 1.42 లక్షల ర్యాంక్ వరకూ కన్వీనర్‌‌‌‌‌‌‌‌ కోటాలో సీట్లు వచ్చాయి. బీసీ–ఏ కేటగిరీలో 1.7 లక్షలు, బీసీ–బీ కేటగిరీలో 1.32 లక్షలు, బీసీ–సీ కేటగిరీలో1.75 లక్షల ర్యాంక్ వరకు, బీసీ–డీ కేటగిరీలో 97 వేలు, బీసీ–ఈ 1.49 లక్షల ర్యాంక్ వరకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1.28 లక్షల ర్యాంక్ వరకు సీట్లు వచ్చాయి. ఈసారి ఇంకా ఎక్కువ ర్యాంకులు వచ్చిన వాళ్లకు కూడా సీట్లు దొరికే చాన్స్​ ఉందని అంచనా వేస్తున్నారు.