మొజాంబిక్ లో ఘోర బోటు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి

మొజాంబిక్ లో ఘోర బోటు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి

మపుటో: తూర్పు ఆఫ్రికా దేశమైనమొజాంబిక్ లో ఘోర ప్రమాదం చోటుచే సుకుంది. బీరా పోర్టు సమీపంలో భారతీ యులతో వెళ్తున్న ఓ బోటు బోల్తాపడటంతో ముగ్గురు చనిపోయారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. మరో ఆరుగురిని అధికారులు రక్షించారు. సముద్రంలో లంగరు వే సిఉన్న ఓ ఆయిల్ ట్యాంకర్లోకి సిబ్బందిని తరలించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనను మొజాంబిక్లోని భారత హైకమిషన్ ధృవీకరించింది. ఈ మేరకు మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేసింది.

సముద్రంలో లంగరు వేసి ఉన్న ఒక ఆయిల్ ట్యాంకర్ లోకి సిబ్బందిని తరలించేందుకు 14 మందితో ఒక బోటు బయలుదేరింది. శుక్రవారం ( అక్టోబర్ 18 ) శుక్రవారం బీరా పోర్టు సమీపంలో ప్రమాదం జరిగింది. సిబ్బందిని తరలించే సమయంలో అనుకోకుండా బోటు నీటిలో బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.

►ALSO READ | బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కూలీ రోబోలు : త్వరలో వచ్చేస్తున్నాయ్..

ఈ ప్రమాదంలో ఆరుగురు భారతీయులు సురక్షితంగా బయటపడగా.. ముగ్గురు మరణించారు. ఒకరు బీరలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గల్లంతైన మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.