బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కూలీ రోబోలు : త్వరలో వచ్చేస్తున్నాయ్..

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కూలీ రోబోలు : త్వరలో వచ్చేస్తున్నాయ్..

టెక్నాలజీ ముందుకెళుతుందా భయపెడుతుందా అనేది కన్ఫ్యూజ్ చేస్తుంది.. ఉద్యోగాలు సృష్టిస్తుందా.. ఉన్న ఉద్యోగం, పనిని మటాష్ చేస్తుందా అనేది కూడా ఇప్పుడు జనాన్ని బెంబేలెత్తిస్తోంది. రోబోలు వచ్చేస్తాయ్.. రాబోయే కాలంలో మరిన్ని వస్తాయి కూడా.. ఇప్పటి వరకు వచ్చిన రోబోలు వేరు.. ఇప్పుడు వచ్చిన రోబోలు వేరు. ఈ రోబోలు కూలీ రోబోలు అన్నమాట.. చైనా స్టూడెంట్స్ తయారు చేసిన రాబోలు.. ఎంతో సక్సెస్ ఫుల్ గా వర్క్ చేస్తున్నాయంట.. చైనాలోని చాంగ్ కింగ్ సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్.. ఈ కూలీ రోబోలను సృష్టించారు. అసలు ఈ రోబోలు ఎలా పని చేస్తాయి అనే తెలుసుకుందామా..

ఇప్పటి వరకు ఈ రోబోలకు స్పెషల్ గా పేరు అయితే పెట్టలేదు కానీ.. మన సోషల్ మీడియా వాళ్లు మాత్రం కూలీ రోబోలు అని ముద్దుగా పిలుస్తున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్ లలో లగేజీ మోయటానికి కూలీలు ఉంటారు కదా.. లగేజీని బరువుకు తగ్గట్టు ఛార్జీ వసూలు చేస్తారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ఈ కూలీ రోబోలను వాడుకోవచ్చన్న  మాట. 

ఈ ఫొటోలు చూడండీ.. ఓ రోబో తన వీపుపై బ్యాగ్ తగిలించుకుంది. మరో చేతిలో సూట్ కేస్ పట్టుకుని నడుస్తుంది. మరో రోబో తన వీపుపై పెద్ద సూట్ కేస్ పెట్టుకుని నడుస్తుంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఈ రోబోలను కూలీల మాదిరి వాడుకోవచ్చంట. బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం నుంచి పార్కింగ్ ప్లేస్ వరకు ఈ కూలీ రోబోలు మన లగేజీలను తీసుకొస్తాయంట. మెట్లు ఉంటే ఎలా అని మీరు టెన్షన్ పడొద్దు.. ఎంచక్కా అవి మెట్లు ఎక్కి దిగగలవు అంట. 

చైనాలో వీటిని విజయవంతంగా పరీక్షించి చూశారంట.. అద్భుతంగా పని చేస్తున్నాయంట. చిన్న రోబో 30 కేజీల బ్యాగ్ ఈజీగా తీసుకెళుతుంది. వాకింగ్ రోబో 60 కిలోల బరువు బ్యాగులను తీసుకెళుతుందంట..

ఇళ్లల్లో పని చేయటానికి కూడా రోబోలు వచ్చేస్తున్న కాలంలో.. బస్లాండ్లు, రైల్వే స్టేషన్ల దగ్గర కూలీ రోబోలు రావటంలో విశేషం ఏముందీ అంటారా.. చైనాలో అంటే ఓకే.. అదే మన దేశంలో లక్షల మంది కూలీలు ఆయా ప్రాంతాలు పని చేస్తుంటారు.. ఇప్పుడు ఈ కూలీ రోబోలు వస్తే వాళ్లకు పని ఎలా.. 24 గంటలూ అలసట అనేది లేకుండా తక్కువ ధరలో ఈ రోబోలు పని చేస్తే.. బస్లాండ్, రైల్వే స్టేషన్లలో పని చేసే కూలీల సంగతి ఏంటీ..