Bigg Boss Telugu 9: కల్యాణ్‌కు అమ్మాయిల పిచ్చి ఉందా? రమ్య ఆరోపణలపై నాగ్ వార్నింగ్!

Bigg Boss Telugu 9:  కల్యాణ్‌కు అమ్మాయిల పిచ్చి ఉందా? రమ్య ఆరోపణలపై నాగ్ వార్నింగ్!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. ఒకే సారి ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. డ్రామా మరింత రెట్టింపు అయింది. అయితే ఈ  వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో దివ్వెల మాధురి, ఆయేషా, రమ్యల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వీరు హౌస్ లో ఉన్న మిగతావారిని  డామినేషన్ చేస్తూ..  బిగ్ బాస్ లా వ్యవహరిస్తున్నారు. దీంతో హౌస్ లో నెలకొన్న డ్రామాలు , సమస్యలకు కింగ్ నాగార్జున వీకెండ్ ఎపిసోడ్‌లో ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. మాధురి డామినేషన్,  రమ్యతీరుపై సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు.

 కల్యాణ్‌కు అమ్మాయిల పిచ్చి ఉందా?

రమ్య హౌస్‌లోకి అడుగుపెట్టగానే టార్గెట్ చేసిన వ్యక్తి పడాల పవన్ కల్యాణ్‌. అతనికి 'అమ్మాయిల పిచ్చి' ఉందని, అతని చూపులు, ప్రవర్తన సరిగా లేవని ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే, కల్యాణ్ ప్రవర్తన కాస్త గజిబిజిగా ఉన్నప్పటికీ, మరీ 'అమ్మాయిల పిచ్చి' అని ముద్ర వేయడం ప్రేక్షకులకు కూడా అతిగా అనిపించింది. వీకెండ్ ఎపిసోడ్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిన నాగార్జున, ముందుగా రమ్య మాట్లాడిన ఓ వీడియో క్లిప్‌ను కన్ఫెషన్ రూమ్‌లో ప్లే చేశారు. ఆ క్లిప్‌లో రమ్య, నాపై చేతులు వేసి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే లాగిపెట్టి ఒక్కటిచ్చేస్తాను అని కల్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడింది. ఈ వీడియో చూసిన కల్యాణ్ ఒక్కసారిగా నోరెళ్లబెట్టాడు, తాను ఇలాంటి ప్రవర్తన ఎప్పుడూ చూడలేదని షాకయ్యాడు.

రమ్యకు నాగ్ అక్షింతలు

రమ్య మాటలపై నాగార్జున గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కిరీటం పెట్టుకున్నంత మాత్రాన రాణివి కావు.. కానీ మనల్ని ఆ కీరిటం పెట్టుకునే అర్హతను తీసుకువచ్చేది మన మాట తీరు. ఒకరిని 'అమ్మాయిల పిచ్చి అనడానికి నువ్వేమీ అతడిని జీవితాంతం చూడలేదు. కేవలం రెండు రోజుల్లోనే ఒకరి గురించి ఇంత పెద్ద ముద్ర వేయడం సరికాదు అని రమ్యను హెచ్చరించారు. అప్పటికప్పుడే తీర్పు ఇచ్చేయడం, తీవ్రమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని స్పష్టం చేశారు. అయితే, కల్యాణ్‌ అమ్మాయిలతో ప్రవర్తించే తీరు సరిగా ఉందా, లేదా అని తెలుసుకునేందుకు నాగార్జున స్టూడియోలో ఉన్న ప్రేక్షకుల్ని అడగ్గా, వచ్చిన స్పందన కల్యాణ్‌కు పెద్ద షాక్‌ ఇచ్చింది. సగం మంది ప్రేక్షకులు అవును అని బదులిచ్చారు. అంటే, జనాల్లో తన ప్రవర్తనపై కొంత వ్యతిరేకత ఉందనే స్పష్టత కల్యాణ్‌కు ఈ ఎపిసోడ్‌తో వచ్చింది.

►ALSO READ | Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌9: దివ్వెల మాధురిపై నాగార్జున ఫైర్.. 'సూపర్ పవర్' కట్.. తీరు మార్చుకో.. !

కల్యాణ్‌కు హెచ్చరిక..

ప్రేక్షకుల స్పందన చూసి ఆశ్చర్యపోయిన కల్యాణ్‌... తను ఇంకా మారాల్సిన అవసరం ఉందని గ్రహించాడు. గతంలో కూడా అతని ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి, కానీ ఈ వారం వచ్చిన క్లారిటీతో తను పూర్తిగా మారడానికి అవకాశం దొరికింది. ఇక అతని దృష్టి అంతా ఆటపై ఫోకస్‌ పెట్టాలి... ఇప్పుడు తన ప్రవర్తనపై ఉన్న లోపాలను సరిచేసుకుని, కేవలం గేమ్ మీద దృష్టి పెడితే, కల్యాణ్‌ విన్నింగ్‌ రేస్‌లో దూసుకుపోవడం ఖాయమని అంటున్నారు ప్రేక్షకులు. వైల్డ్‌కార్డ్‌ల వేడికి, నాగ్‌ క్లాస్‌తో కూడిన హెచ్చరికలు తోడవ్వడంతో బిగ్‌బాస్ హౌస్ ఇకపై మరింత ఆసక్తికరంగా మారనుంది.