
- యాక్టీవ్ గా పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- బీసీయేతరులు కావడమే కారణమా ?
హైదరాబాద్: బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పించాలనే డిమాండ్ తో యావత్ తెలంగాణ స్తంభించింది. అయితే తాము వ్యతిరేకం కాదని చెబుతూ వస్తున్న పార్టీల చీఫ్ లు ఆందోళనల్లో పత్తా లేకుండా పోయారు. ఆర్ కృష్ణయ్య స్వయంగా అన్ని పార్టీల చీఫ్ లను కలిసి బంద్ కు మద్దతు కోరారు. అందరూ పూర్తి మద్దతు ప్రకటించారు. అయితే ఇవాళ్టి బంద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొనలేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో నిర్వహించిన నిరసనలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
అదే విధంగా బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు, బీజేఎల్పీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి కూడా ధర్నాల వైపు రాలేదు. దీంతో వీళ్లు ఎందుకు రాలేదనే చర్చ మొదలైంది. అదే సమయంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ యాక్టీవ్ గా ఆందోళనలో పాల్గొన్నారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. ట్యాంకు బండ్ పై బైఠాయించారు.
►ALSO READ | బీసీ జేఏసీ బంద్: నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత.. కార్ల షోరూం అద్దాలు ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలు..
హరీశ్ రావు, కేటీఆర్ వెలమ సామాజిక వర్గం, అదే విధంగా బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు బ్రాహ్మణ సామాజిక వర్గం.. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా ఓసీ కావడంతోనే ఈ ఆందోళనల్లో పాల్గొనలేదా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది.