బీసీ జేఏసీ బంద్: నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత.. కార్ల షోరూం అద్దాలు ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలు..

బీసీ జేఏసీ బంద్: నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత.. కార్ల షోరూం అద్దాలు ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలు..

బీసీ  42శాతం రిజర్వేషన్లకోసం బీసీ సంఘాల జేఏసీ తలపెట్టిన తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్​ ప్రశాంతంగా సాగుతోంది.శనివారం ( అక్టోబర్​18) హైదరాబాద్​నగరంతోపాటు అన్ని జిల్లాల్లో స్వచ్ఛందంగా బంద్​ పాటించారు ప్రజలు. స్టేట్​ వైడ్​ గా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ క్రమంలో నల్గొండ జిల్లాలో బీసీ జేఏసీ బంద్ ఉద్రిక్తతకు దారి తీసింది. పట్టణంలోని చర్లప్పల్లి పవన్ మోటార్స్ కార్ల షోరూంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. 

బంద్ చేయకుండా షోరూం ఓపెన్ చేసారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు షోరూం అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నల్గొండ డీఎస్పీ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్​ సిటీలో కూడా వ్యాపారులు స్వచ్చందంగా షాపులు మూసివేసి బంద్​ లో పాల్గొన్నారు. జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర బీసీ సంఘాల నాయకులు బంద్ లో పాల్గొన్నారు.

►ALSO READ | చైన్ స్నాచింగ్ కు యత్నించి దొరికిన దొంగ.. చితకబాదిన స్థానికులు

42 శాతం కోసం బీసీల సంఘాల బంద్ పిలుపు మేరకు జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బీసీ సంఘాల నేతలు బంద్ లో పాల్గొన్నారు. శేరిలింగంపల్లి లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్​పాటించారు. బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యారు. ఎంజీబీఎస్​, కంటోన్మెంట్, ఫికెట్ లలో బస్సులు డిపోలలోనే ఉండిపోయాయి. 

మరోవైపు దిల్ సుఖ్ నగర్ డిపోలో ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందగా బీసీ బంద్​ పాటించారు. దీంతో పండక్కి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంద్ ప్రభావం తో ఉప్పల్ మెట్రో రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నారుప్రయాణికులు.