
నల్లగొండ జిల్లాలో చైన్ స్నాచింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి.. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్న దుండగులు విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్తున్నారు. శనివారం ( అక్టోబర్ 18) నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం దాసరిగూడెం ఒంటరిగా ఉన్న మహిళ మెడలోంచి బంగారం పుస్తెల తాడు దొంగిలించేందుకు యత్నించాడు ఓ దొంగ. మహిళ కేకలు వేయడంతో స్థానికులు దొంగనుపట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.