విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై నో ఎక్స్‌ట్రా ఛార్జ్.. ఫ్రీ !

విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై నో ఎక్స్‌ట్రా ఛార్జ్.. ఫ్రీ !

భారత్లోని విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విమానాల్లో సీట్ సెలక్షన్పై విధించే అదనపు భారం నుంచి ప్రయాణికులకు విముక్తి కలిగించాలని కేంద్ర విమానయాన శాఖ నిర్ణయించింది.

ఇందులో భాగంగా.. ఇకపై విమానాల్లోని 60 శాతం సీట్ల వరకూ ప్రయాణికులు తమకు నచ్చిన సీటును పూర్తి ఉచితంగా ఎంపిక చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ ఎయిర్ లైన్స్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. 

ALSO READ : హైదరాబాదులో తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్.. బుధవారం రేట్లు ఇవే..

ఇప్పటిదాకా కొన్ని ఎయిర్ లైన్స్ కంపెనీలు ప్రయాణికులకు నచ్చిన సీటు కావాలంటే అదనపు ఛార్జీలను విధించాయి. ఈ అదనపు ఛార్జీలు ప్రయాణికులకు భారంగా మారాయి. ఈ అదనపు ఛార్జీలపై పలు ఫిర్యాదులు అందడంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రయాణికులకు ఊరట కలిగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే విస్తృత నెట్ వర్క్ కలిగిన విమానయాన రంగంలో భారత్ మూడో స్థానంలో ఉంది. మన దేశంలోని విమానాశ్రయాల నుంచి ప్రతి రోజూ సుమారు ఐదు లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.