ఆఫ్ఘాన్ క్రికెటర్ల మృతి.. రషీద్ ఖాన్ PSL ను బాయ్కాట్ చేస్తున్నాడా..?

ఆఫ్ఘాన్ క్రికెటర్ల మృతి..  రషీద్ ఖాన్ PSL ను బాయ్కాట్ చేస్తున్నాడా..?

ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్ల మృతి పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరు దేశాల సైన్యాలు ఒకవైపు పోరాడుతుంటే.. ఇప్పుడు క్రికెట్ పైన కూడా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ తో నవంబర్ లో ఉన్న ట్రై సీరీస్ ను రద్దు చేసుకుంటున్నట్లు ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 

తమ దేశ ఆటగాళ్ల మృతిపై ఆఫ్ఘాన్ క్రికెటర్లు సీరియస్ గా ఉన్నారు. అయితే కెప్టెన్న రషీద్ ఖాన్ ఈ అంశంపై తీవ్రంగా స్పందించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ ను బాయ్ కాట్ చేయనున్నట్లు వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  నిజంగా రషీద్ ఖాన్ పీఎస్ఎల్ ను బాయ్ కాట్ చేస్తున్నాడా..? ఈ ఆఫ్ఘాన్ కెప్టెన్ ఇచ్చిన సంకేతం ఏంటో తెలుసుకుందాం. 

ఇండియాలో ఐపీఎల్ (IPL) ఎలాగో పాకిస్తాన్ లో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ఉంటుంది. ఈ లీగ్ లో ఇండియా ఆడకపోయినా కొన్ని దేశాల ప్లేయర్లు ఆడుతుంటారు. అయితే ఈ సారి పీఎస్ఎల్ ను బాయ్ కాట్ చేయనున్నట్లు సంకేతాలిచ్చాడు రషీద్ ఖాన్. తన ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్ ఫామ్ బయో నుంచి PSL ఫ్రాంఛైజీ పేరు తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. 

►ALSO READ | రంజీ ట్రోఫీలో తన్మయ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ..

లాహోర్ ఖలండర్స్ ఫ్రాంఛైజీలో సభ్యుడిగా ఉన్న రషీద్ ఖాన్.. దాన్ని తన బయో నుంచి తొలగించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పాకిస్తాన్ ఏరియల్ స్ట్రైక్ లో ముగ్గురు లోకల్ క్రికెటర్లతో పాటు ఐదు మంది పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. బోర్డర్ లో పక్టిక ప్రావిన్స్ సమీపంలో జరిగిన ఈ దాడిలో కబీర్, సిగ్బతుల్లా, హరూన్ అనే క్రికెటర్లు షరానా లో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి వస్తుండగా దాడి జరిగింది. పాక్ దాడిపై పిరికిపంద చర్యగా ఆగ్రహించిన రషీద్ ఖాన్.. లేటెస్టుగా లాహోర్ ఖాలండర్స్ ను బయో నుంచి డిలీట్ చేయడం.. పీఎస్ఎల్ ను బాయ్ కాట్ చేస్తున్నాడనే రూమర్స్ కు కారణమయ్యింది. 

ఇప్పటికే ట్రై సీరీస్ ను రద్దు చేస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే సీరీస్ యదావిధిగా కొనసాగుతుందని పాక్ క్రికెట్ బోర్డు అనౌన్స్ చేసింది. నవంబర్ లో ఈ సీరీస్ జరుగుతుందో లేదో చూడాలి.